Vizag: విశాఖ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలు ఆహ్లాదకరంగా, అందంగా ఉంటాయి. కానీ మారుమూల పల్లెలకు రవాణా సౌకర్యం ఉండదు. కనీసం రోడ్లు కూడా లేక చెట్లు, కొండలు, గుట్టలు దాటుకుంటూ అక్కడి ప్రజలు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. ఇక వర్షాలు, చలికాలం.. ఇలాంటి సమయాల్లో వారి బాధ వర్ణనాతీతం. అంతేకాకుండా ఏజెన్సీ ప్రాంతాల్లో ఎవరికైనా ఏదైనా ఆపద వస్తే.. వాళ్లు అక్కడి నుంచి బయట పడాలంటే ఒక యుద్ధం చేయాల్సిందే. ఇక అనారోగ్యం బారిన పడినవారు, పురిటి నొప్పులు వచ్చిన గర్భిణీలు, చావుబతుకుల్లో ఉన్న …
Read More »TCS Campus in Vizag: విశాఖలో క్యాంపస్ ఏర్పాటు.. ప్లాన్ మార్చిన టీసీఎస్!.. అక్కడేనా?
ఏపీలోని యువతకు శుభవార్త.. విశాఖపట్నంలో టీసీఎస్ క్యాంపస్ ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. టాటా సన్స్ బోర్డు ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్‌తో భేటీ అనంతరం.. ఏపీలో టీసీఎస్ క్యాంపస్ ఏర్పాటు చేయనున్నట్లు ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అనంతరం 100 రోజుల్లోనే విశాఖపట్నంలో టీసీఎస్ క్యాంపస్‌కు శంకుస్థాపన చేస్తామని.. నారా లోకేష్ ఇటీవల మరోసారి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో వైజాగ్‌లో టీసీఎస్ క్యాంపస్ ఏర్పాటు కోసం ప్రయత్నాలు వేగంగా జరుగుతున్నాయి. అయితే వేగంగా టీసీఎస్ క్యాంపస్ ఏర్పాటు …
Read More »విశాఖవాసులకు పోలీసుల సూపర్ న్యూస్.. ఇక అర్ధరాత్రి 12 వరకు అనుమతి
విశాఖపట్నంలో హోటల్స్, రెస్టారెంట్‌లకు సంబంధించి పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నగరంలో అర్ధరాత్రి 12 గంటల వరకూ అన్నిరకాల హోటళ్లు, రెస్టారెంట్లు నడుపుకోవచ్చని తెలిపారు. ఇది వెంటనే అమలులోకి వస్తుందని.. అయితే బార్లు, వాటికి అనుబంధంగా ఉన్న రెస్టారెంట్లు మాత్రం రాత్రి పది గంటలకే మూసేయాలని తేల్చి చెప్పారు. ఈ నిర్ణయంతో విశాఖవాసులకు అర్థరాత్రి సమయంలో కూడా ఫుడ్ అందుబాటులో ఉండనుంది. విశాఖలో హోటళ్ల సమయాలపై ఇటీవల జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో చర్చకు వచ్చింది. నగరానికి రాత్రి 11 గంటల తరువాత …
Read More »విశాఖలో ఓ అపార్ట్‌మెంట్‌లో గుట్టుగా.. పోలీసులు డోర్ తీయగానే, అమ్మాయిలతో అడ్డంగా దొరికిపోయారు
విశాఖపట్నంలో సరికొత్త దందా బయటపడింది. నగరంలో కాస్మొటిక్స్ అమ్మకాల ముసుగులో ఆన్‌లైన్ బెట్టింగ్, ఇతర ఆన్‌లైన్ మోసాలు చేస్తున్న గ్యాంగ్ ఆటకట్టించారు పోలీసులు. ఓ అపార్ట్‌మెంట్ కేంద్రంగా ఈ తతంగం మొత్తం నడుస్తుండగా.. విశాఖ సైబర్ క్రైమ్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. ఈ గ్యాంగ్ చైనా కేంద్రంగా నడిచే ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నారు.. మొత్తం ఏడుగురిని అరెస్టు చేశారు. పోలీసులు చెబుతున్న వివరాల ఇలా ఉన్నాయి.. విశాఖపట్నంకు చెందిన సూర్యమోహన్ హాంకాంగ్, తైవాన్‌కు వెళ్లొచ్చారు. అనంతరం నగరానికి చెందిన సాయిరామ్, గిరిష్‌లతో …
Read More »విశాఖ: మద్యం అమ్మేందుకు షాపు దొరకలేదు.. అందుకే ఇలా, ఐడియా అదిరిపోయింది
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మద్యం షాపులు ప్రారంభం అయ్యాయి.. బుధవారం నుంచి అమ్మకాలు మొదలుపెట్టారు. దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్నట్లుగా.. లాటరీలో కొత్తగా మద్యం షాపులు దక్కించుకున్నవారిని కొత్త సమస్య వెంటాడుతోంది. శుభమా అని కొత్త షాపు ఓపెన్ చేద్దామంటే అద్దెకు గదులు దొరకడం లేదు.. రాష్ట్రంలో చాలామందికి ఇదే సమస్య ఎదురవుతోంది. షాపుల దొరక్క ఇబ్బందులుపడుతున్నారు.. కొన్ని ప్రాంతాల్లో షాపులు దొరికినా అద్దెలు భారీగా ఉండటంతో భయపడుతున్నారు. ఒక్కరోజు మద్యం విక్రయాలు ఆగిపోయినా నష్టాలు తప్పవు. ఇలాంటి పరిస్థితుల్లో కొందరు తాత్కాలికంగా వసతి ఏర్పాటు …
Read More »విజయవాడ, విశాఖవాసులకు అదిరిపోయే న్యూస్.. గంట జర్నీ మాత్రమే, కొత్త విమాన సర్వీసులు
విజయవడ నుంచి ఇండిగో విమానం సాయంత్రం 7.15 గంటలకు బయలుదేరి రాత్రి 8.20 గంటలకు విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకుంటుంది. అక్కడ నుంచి తిరుగ ప్రయాణంలో విమానం రాత్రి 8.45 గంటలకు బయలుదేరి రాత్రి 9.50 గంటలకు విజయవాడ చేరుకుంటుందని అధికారులు తెలిపారు. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సర్వీస్ విషయానికి వస్తే.. ఉదయం 9.35 గంటలకు విశాఖపట్నం నుంచి బయలుదేరి.. 10.35 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో విజయవాడ నుంచి రాత్రి 7.55 గంటలకు బయలుదేరి 9 గంటలకు విశాఖపట్నం వెళ్తుంది. ఈ సర్వీస్‌ల …
Read More »అరకు వెళ్లే పర్యాటకులకు అద్భుతమైన అవకాశం.. ఊటీ రేంజ్‌లో థ్రిల్, ఆ రెండు సరికొత్త అనుభూతులు
ఆంద్రప్రదేశ్‌లో పర్యాటక ప్రదేశాలపై మరింత ఫోకస్ పెట్టింది ప్రభుత్వం. ఈ మేరకు ఆంధ్రా ఊటీగా పిలిచే అరకులో పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఈ మేరకు పద్మాపురం ఉద్యానంలో హాట్ బెలూన్‌ను సందర్శకుల కోసం అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఈ మేరకు ట్రయల్‌రన్‌ని నిర్వహించారు. అరకు లోయకి ఏటా సుమారు మూడు లక్షల మంది వరకు పర్యాటకులు వస్తుంటారన్నారు పాడేరు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి అభిషేక్. అందుకే హాట్‌బెలూన్ అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు తెలిపారు. హాట్ బెలూన్ పర్ాయటకులను సుమారు 300 …
Read More »విశాఖపట్నంకు ప్రపంచస్థాయి గుర్తింపు.. జియో పార్కు హోదా?, వివరాలివే
విశాఖపట్నంకు మరో అరుదైను గుర్తింపు లభించే అవకాశం ఉంది. యునెస్కో ప్రపంచ వ్యాప్తంగా 48 దేశాల్లోని 200 ప్రాంతాలను జియో పార్కులుగా గుర్తించగా.. విశాఖకు కూడా ఆ గుర్తింపు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. మన దేశంలోని ఆరు ప్రదేశాలను జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించగా.. వాటిలో జబల్‌పూర్ జియోపార్కు, సిక్కిం మామెలిలో పోషిల్ పార్కు, కేరళ వరకల జియోపార్కు, రాజస్థాన్‌లో రామగర్ జియోపార్కు, లద్దాఖ్‌లో లామయూరు మ్యూజియం, విశాఖపట్నం అర్బన్ జియో పార్కులు ఉన్నాయి. ఈ మధ్య ఢిల్లీలో యునెస్కో- జీఎస్‌ఐ సంయుక్తంగా …
Read More »ఏపీలో ‘లులు’ను మేమే వద్దన్నాం.. కారణాలు ఏంటో చెప్పిన మాజీ మంత్రి బొత్స
ఆం ధ్రప్రదేశ్‌లో లులు ప్రాజెక్టుపై మరోసారి చర్చ జరుగుతోంది. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం నుంచి పెట్టుబడులు ఉపసంహరించుకోగా.. తాజాగా లులూ గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమని చెప్పారు. అయితే గత ప్రభుత్వం లులును వెళ్లగొట్టిందనే విమర్శలు రావడంతో.. ఈ అంశంపై వైఎస్సార్‌సీపీ నేతలు స్పందిస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో లులు గ్రూపు వెళ్లిపోవడానికి కారణాలను చెప్పారు. విశాఖలో లులు ప్రాజెక్టును …
Read More »పైకి చూస్తే పాన్ షాపు.. రోజూ జనాలతో రద్దీ, అనుమానంతో వెళ్లి చూస్తే!
విశాఖపట్నంలో గంజాయి చాక్లెట్లు కలకలంరేపాయి.. ఇటీవల పోలీసుల నిఘా పెరగడంతో గంజాయి స్మగ్లింగ్ బ్యాచ్ కొత్త మార్గాన్ని ఎంచుకుంది. చాక్లెట్ల రూపంలో గంజాయిని ప్యాక్ చేసి అమ్మేస్తోంది.. ఓ పాన్‌లో షాపులో విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. విశాఖపట్నంలోని క్రాంతిథియేటర్ ఎదురుగా మనోజ్‌కుమార్‌చౌదరి పాన్‌షాప్ నిర్వహిస్తున్నాడు. అతడి షాపులో గంజాయితో తయారుచేసిన చాక్లెట్లను రహస్యంగా విక్రయిస్తున్నట్లు పోలీసులకు పక్కగా సమాచారం వచ్చింది. వెంటనే టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆ పాన్ షాపులో దాడులు చేయగా.. అమ్మకానికి సిద్ధంగా ఉంచి 133 గంజాయి చాకెట్లు (660 గ్రాములు) దొరికాయి.చాకెట్లను …
Read More »