Recent Posts

ఏపీలో ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ఈ రూల్ తెలుసా, పరీక్ష కూడా రాయనివ్వరు

ఏపీలో ఇంటర్ విద్యార్థులకు సంబంధించి బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల హాజరు విషయంలో కఠినంగా వ్యవహరించాలని.. క్లాసులు ఎగ్గొట్టేవారిని కాలేజీలకు తీసుకురావాలని నిర్ణయించింది. ఈ ఏడాది నుంచి ఇంటర్ విద్యార్థులకు హాజరు నిబంధనను తప్పనిసరిగా అమలు చేస్తున్నారు. ఈ మేరకు ఇంటర్‌ విద్యామండలి కార్యదర్శి కృతిక శుక్లా ఆదేశాలు జారీచేశారు. హాజరు శాతం నిబంధనలను కచ్చితంగా అమలుచేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ రెగ్యులర్‌ విద్యార్థులకు 75శాతం హాజరు తప్పనిసరి అని తెలిపారు. ఎవరైనా విద్యార్థులు.. ఏవైనా ప్రత్యేక సందర్భాలుంటే 15 శాతం వరకు …

Read More »

 అధ్యక్ష పదవి పోయిన తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు డొనాల్డ్ ట్రంప్ రహస్య ఫోన్ కాల్స్

Donald Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. అక్కడ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అభ్యర్థులు వ్యక్తిగత విమర్శలు చేసుకునే వరకు వెళ్లాయి. ఇక రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌.. హోరాహోరీగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన డొనాల్డ్ ట్రంప్.. ఆ తర్వాత రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్‌తో రహస్యంగా ఫోన్‌లో సంభాషణలు జరిపినట్లు తాజాగా కీలక విషయాలు బయటికి వచ్చాయి. …

Read More »

పవన్ కళ్యాణ్‌తో సినీ నటుడు షాయాజీ షిండే భేటీ.. అద్భుతమైన ఐడియా

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌తో సినీ నటుడు షాయాజీ షిండే సమావేశం అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో ప్రసాదంతో పాటు ఒక మొక్కను కూడా భక్తులకు అందిస్తే పచ్చదనం పెరుగుతుందని షిండే వ్యాఖ్యానించారు. ఇటీవల తన ఆలోచనను పవన్‌ కళ్యాణ్‌తో పంచుకుంటానని ఓ టీవీ కార్యక్రమంలో చెప్పిన సంగతి తెలిసిందే. ఈ మేరకు మంగళగిరిలోని డిప్యూటీ సీఎం కార్యాలయానికి వచ్చిన షాయాజీ షిండే పవన్ కళ్యాణ్‌ను కలవడం ఆసక్తికరంగా మారింది. వీరి సమావేశానికి సంబంధించిన ఫొటోలను జనసేన పార్టీ కార్యాలయం ఎక్ (ట్విట్టర్) వేదికగా …

Read More »