Recent Posts

తిరువూరు: ఏటీఎంలో రూ.5వేలు నొక్కితే రూ.7వేలు వచ్చాయి.. పండగ చేసుకున్నారుగా

ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో విచిత్రమైన ఘటన జరిగింది. పట్టణంలోని ఓ ఏటీఎంలో నుంచి నోట్ల వర్షం కురిసింది. స్థానికంగా ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంలో రూ.5వేలు డ్రా చేస్తే రూ.7వేలు వచ్చాయి. ఈ విషయం ఆ నోటా ఈ నోటా అందరికి తెలియడంతో.. కొందరు కస్టమర్లు ఏటీఎంకు వచ్చి డబ్బులు డ్రా చేసుకుని వెళ్లారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు బ్యాంకు అధికారులతో కలిసి ఏటీఎంను మూసివేయించారు. సాంకేతిక సమస్య కారణంగా ఇలా జరిగిందని తెలుస్తోంది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. ఆ తర్వాత …

Read More »

మాధురిని పరిచయం చేసింది నా భార్యే.. ఏం తప్పుచేశానని నాకీ శిక్ష?.. దువ్వాడ

కుటుంబ వివాదంపై వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ స్పందించారు. విలేకర్ల సమావేశం నిర్వహించిన దువ్వాడ శ్రీనివాస్.. కీలక వ్యాఖ్యలు చేశారు. తన భార్య వాణి అహంకారంతో వ్యవహరిస్తూ.. తనపై కూతుర్లకు ద్వేషం నూరిపోశారని ఆరోపించారు. ప్రతి ఇంట్లోనూ గొడవలు సహజమేనన్న దువ్వాడ శ్రీను.. వాటిని నాలుగు గోడల మధ్యనే పరిష్కరించుకోవాలన్నారు. వ్యాపారంతో పాటుగా రాజకీయాల్లో కూడా తానే ఉండాలని వాణి అహంకారంతో వ్యవహరించిందని.. కుమార్తెలకు తనపై ద్వేషం నింపిందన్నారు. వైఎస్ జగన్ తనకు టెక్కలి టికెట్ ప్రకటిస్తే.. తనకు కావాలని వాణి పట్టుబట్టిందన్నారు. విడాకులు …

Read More »

తిరుమలకు ఆగస్టు 14, 15 తర్వాత వెళ్తున్నారా.. మూడు రోజుల పాటూ రద్దు, టీటీడీ ప్రకటన

తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్యమైన గమనిక. ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకు పవిత్రోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. తిరుమల ఆలయంలో ఆగ‌స్టు 14న అంకురార్పణంతో ఈ పవిత్రోత్సవాలు ప్రారంభమవుతాయి. ఏడాది పొడవునా శ్రీవారి ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్ల గానీ, సిబ్బంది వల్లగానీ తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. పవిత్రోత్సవాలు తిరుమలలో 15-16 శతాబ్దాల వరకు జరిగినట్టు ఆధారాలున్నాయి. 1962వ సంవత్సరం నుంచి దేవస్థానం …

Read More »