బోరుగడ్డ అనిల్ కుమార్ అరెస్ట్ మీద ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత స్పందించారు. అనిల్ అరెస్ట్ విషయంలో కులం ప్రస్తావన తీసుకువస్తుండటాన్ని వంగలపూడి అనిత తప్పుబట్టారు. “డాక్టర్ సుధాకర్‍ను రోడ్డు మీద కూర్చోబెట్టి పిచ్చోణ్ని చేస్తే.. అతని అవమానం తట్టుకోలేక చనిపోయారు. వరప్రసాద్ అనే యువకుడికి శిరోముండనం చేయించారు. ఇవన్నీ జరిగినప్పుడు దళితులకు అన్యాయం జరిగిందని ఎందుకు రోడ్డు మీదకు రాలేదు.ఇప్పుడు దళిత కార్డు బయటికి తీసుకు వస్తున్న వారు, అప్పుడు ఎందుకు స్పందించలేదు? దళితురాలైన నన్ను సీఎం చంద్రబాబు గారు.. హోం …
Read More »ఇలా జాగ్రత్తలు పాటిస్తూ కూడా సినిమాలు తీస్తాం.. అనన్య నాగళ్లను ప్రశ్న అడిగిన రిపోర్టర్‌కు గట్టిగా ఇచ్చిన డైరెక్టర్
తెలుగు వాళ్లకు ఛాన్స్ ఇవ్వాలంటే ఫస్ట్ కమిట్మెంట్ అడుగుతారు అని.. అది వేరే ఇండస్ట్రీలో ఉండదని.. కేవలం ఇక్కడే ఉంటుందని.. అగ్రిమెంట్లోనే కమిట్మెంట్ గురించి ఉంటుందని.. కమిట్మెంట్ ఇస్తేనే ఆఫర్లు ఇస్తారని.. కమిట్మెంట్లకు ఒప్పుకుంటే ఒక రకంగా రెమ్యూనరేషన్ ఇస్తారని, ఒప్పుకోకపోతే ఇంకోలా రెమ్యూనరేషన్ ఇస్తారని ఇలా ఓ లేడీ రిపోర్టర్ ప్రశ్న రూపంలో తనకు తెలిసిన, తెలియన విషయాలన్ని ప్రస్థావించింది. అంతా ఆమె దగ్గరుండి చూసినట్టుగా, అంతా ఆమెకే తెలుసు అన్నట్టుగా ప్రశ్న వేసింది. అసలు అక్కడ ప్రశ్న వేసినట్టుగా కూడా లేదు.. …
Read More »Bomb Threats: ఎవర్రా మీరంతా.. 24 గంటల్లో 20కి పైగా విమానాలకు బాంబు బెదిరింపులు, ఈ వారంలో 70కి పైనే!
Bomb Threats: కొందరు ఆకతాయిలు చేస్తున్న పనులతో విమాన ప్రయాణికులు, ఎయిర్‌లైన్స్ సిబ్బంది, ప్రభుత్వానికి ముచ్చెమటలు పడుతున్నాయి. విమానాల్లో బాంబులు పెట్టామంటూ చేస్తున్న బెదిరింపులతో అధికారులు, సిబ్బంది.. క్షణం తీరికలేకుండా ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఇక కొన్ని రోజుల నుంచి విమానాలకు వరుసగా బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. గత 24 గంటల వ్యవధిలోనే 20కి పైగా విమానాలకు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర అలజడి సృష్టిస్తోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు విమానాల్లో అణువణువునా గాలింపు చేపట్టగా.. ఎలాంటి పేలుడు పదార్థాలు …
Read More »కేంద్ర మంత్రి బండి సంజయ్ అరెస్ట్.. గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళన ఉద్రిక్తం..!
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలంటూ అభ్యర్థులు చేస్తున్న ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. హైదరాబాద్‌లోని అటు అశోక్ నగర్‌లో, ఇటు ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో గ్రూప్-1 అభ్యర్థులు చేస్తున్న ఆందోళనలకు యువత నుంచే కాకుండా బీజేపీ, బీఆర్ఎస్ లాంటి రాజకీయ పార్టీల నేతల నుంచి భారీ మద్దతు లభిస్తోంది. గ్రూప్-1 అభ్యర్థులకు అండగా.. నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున తరలివచ్చి మద్దతు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే.. కేంద్రం మంత్రి బండి సంజయ్ కూడా గ్రూప్-1 అభ్యర్థులకు అండగా నిలిచారు. అభ్యర్థులు చేస్తున్న ఆందోళనలో బండి సంజయ్ …
Read More »గేమ్ చేంజర్ సాంగ్.. అంజలి లీక్ చేసినట్టేనా?
రామ్ చరణ్ శంకర్ కాంబోలో తెరకెక్కించిన గేమ్ చేంజర్‌ను సంక్రాంతికి బరిలో దించుతున్నాడు దిల్ రాజు. అయితే తాజాగా ఈ మూవీ నుంచి రాబోయే పాట ఎలా ఉంటుందో అంజలి చిన్న హింట్ ఇచ్చినట్టుగా అనిపిస్తోంది. గేమ్ చేంజర్ పాటల మీద చాలా మందికి అంత హోప్స్ ఏమీ లేవన్న సంగతి తెలిసిందే. జరగండి పాట లీక్ అయి ట్రోలింగ్‌ను మూటగట్టుకుంది. ఆ పాట కూాడా జనాలకు అంతగా ఎక్కలేదు. రా మచ్చా మచ్చా పాట ట్యూన్, బాణీ ఇవేవీ కూడా ఆకట్టుకోలేకపోయాయి. రామ్ …
Read More »విశాఖవాసులకు పోలీసుల సూపర్ న్యూస్.. ఇక అర్ధరాత్రి 12 వరకు అనుమతి
విశాఖపట్నంలో హోటల్స్, రెస్టారెంట్‌లకు సంబంధించి పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నగరంలో అర్ధరాత్రి 12 గంటల వరకూ అన్నిరకాల హోటళ్లు, రెస్టారెంట్లు నడుపుకోవచ్చని తెలిపారు. ఇది వెంటనే అమలులోకి వస్తుందని.. అయితే బార్లు, వాటికి అనుబంధంగా ఉన్న రెస్టారెంట్లు మాత్రం రాత్రి పది గంటలకే మూసేయాలని తేల్చి చెప్పారు. ఈ నిర్ణయంతో విశాఖవాసులకు అర్థరాత్రి సమయంలో కూడా ఫుడ్ అందుబాటులో ఉండనుంది. విశాఖలో హోటళ్ల సమయాలపై ఇటీవల జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో చర్చకు వచ్చింది. నగరానికి రాత్రి 11 గంటల తరువాత …
Read More »ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పీవీ సింధుకు ఆన్‌డ్యూటీ మరో ఏడాది పొడిగింపు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వంలో డిప్యూటీ కలెక్టర్ హోదాలో ఉన్న పీవీ సింధుకు ఆన్ డ్యూటీ సదుపాయాన్ని మరో ఏడాది పొడిగించింది. సింధు ఆసియా, కామన్వెల్త్ క్రీడలతోపాటు 2025-26లో వివిధ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేందుకు శిక్షణ నిమిత్తం ఆమెకు ఓడీ (ఆన్ డ్యూటీ) సదుపాయాన్ని కల్పించారు. ఆమెకు వచ్చే ఏడాది సెప్టెంబరు 30 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పీవీ సింధు ప్రస్తుతం హైదరాబాద్‌లో ఏపీ ప్రభుత్వ అధీనంలో ఉన్న లేక్‌వ్యూ …
Read More »TTD Darshan Tickets : తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లు.. ఆన్‌లైన్‌లో ఇలా సింపుల్‌గా బుక్ చేసుకోవచ్చు.. ప్రాసెస్ ఇదే
TTD Darshan Tickets : తిరుమల (TTD Temple)కు వెళ్లే శ్రీవారి భక్తులకు దర్శనం టికెట్లు అంత ఈజీగా దొరకవు. ప్రత్యేక దర్శనం, సేవా టికెట్లను ఒకటి రెండు నెలల ముందే బుక్ చేసుకోవాలి. పోనీ.. ఉచిత దర్శనానికి వెళ్దామంటే రోజంతా క్యూ లైన్‌లో ఉండాలి. మరి 300 రూపాయల దర్శనం టికెట్లు లేని వారు.. గంటల పాటు క్యూలైన్‌లో వెయిట్ చేయలేని ఖచ్చితంగా టికెట్లు బుక్ చేసుకోవాల్సిందే. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే.. ఏదైనా ఒక టికెట్ ఉండాలి. 300 రూపాయల ప్రత్యేక దర్శనం, ఆర్జిత …
Read More »ఏపీలో స్కూల్ విద్యార్థులు, తల్లిదండ్రులకు శుభవార్త.. నవంబర్‌లో పక్కా, ఆ జీవో కూడా రద్దు!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్కూళ్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో-117ను వచ్చే విద్యా సంవత్సరం నుంచి రద్దు చేయాలని నిర్ణయించింది. స్కూళ్లలో తరగతుల విలీనం, ఉపాధ్యాయుల సర్దుబాటు, టీచర్లకు వారానికి 42 పీరియడ్ల బోధన, ప్రాథమిక స్థాయిలో 20 మందికి ఒక టీచర్ లాంటి వాటిని అమలు చేసేందుకు ఈ జీవోను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ జీవోను రద్దు చేస్తామని ఎన్నికల సమయంలో కూటమి హామీ ఇచ్చింది. తాజాగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి దీన్ని రద్దు …
Read More »చివరికి పోస్టాఫీస్‌ను కూడా వదల్లేదు కదరా.. 600 పార్శిళ్లు తెరిచి చూసిన పోలీసులు షాక్
Post Office: గత కొంతకాలంగా దేశంలో భారీగా డ్రగ్స్ పట్టుబడుతున్నాయి. మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా చేస్తూ.. చాలా మంది నార్కొటిక్ అధికారులు, పోలీసులకు చిక్కుతున్నారు. రూ.వేల కోట్ల విలువైన కిలోల కొద్ది డ్రగ్స్.. దొరుకుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ డ్రగ్స్ కట్టడి చేసేందుకు అధికారులు, ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా.. వాటి సరఫరా మాత్రం ఆగడం లేదు. ఇతర దేశాల నుంచి వచ్చే డ్రగ్స్‌ను పోర్టుల వద్ద, ఎయిర్‌పోర్టుల వద్ద పట్టుకుంటూనే ఉన్నారు. ఈ క్రమంలోనే డ్రగ్స్ సరఫరాదారులు రూటు మార్చారు. …
Read More »ఏపీకి పొంచి ఉన్న మరో వాయుగుండం ముప్పు.. వాతావరణశాఖ హెచ్చరిక, ఈ జిల్లాలపై ప్రభావం
ఏపీలో మరోసారి వాన ముప్పు పొంచి ఉందని చెబుతోంది వాతావరణశాఖ. బంగాళాఖాతంలో ఉత్తర అండమాన్ ప్రాంతంలో ఆదివారం ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రభావంతో బంగాళాఖాతంలో ఈనెల 22నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉదంటున్నారు. ఆ తర్వాత ఇది వాయవ్య దిశగా కదులుతూ.. ఈ నెల 24 నాటికి వాయుగుండంగా బలపడవచ్చొని చెబుతున్నారు. ఈ వాయుగుండం ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్ మధ్యలో తీరం దాటొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ అల్పపీడనం ఏర్పడిన తర్వాత పూర్తిగా స్పష్టత వస్తుందని చెబుతుంది వాతావరణశాఖ. ఈ ప్రభావంతో …
Read More »ఏపీలో ఎమ్మెల్యేలకు తిరుమల దర్శనాల కోటా పెంపు.. ఇకపై వారంలో ఆరు రోజులు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు.. పలు కీలక అంశాలపై చర్చించారు. అయితే తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుమల దర్శనాలకు సంబంధించి.. ప్రస్తుతం వారంలో నాలుగు రోజులపాటు ఎమ్మెల్యేల సిఫారసు లేఖల్ని అనుమతిస్తున్నారు. అయితే ఇకపై వాటిని ఆరు రోజులకు పెంచేందుకు ముఖ్యమంత్రి అంగీకరించారు. అలాగే వారికి వారంలో ఆరు రోజులపాటు, రోజుకి ఆరు చొప్పున సుపథం (రూ.300 టికెట్‌లు) ఇచ్చేందుకూ ఓకే చెప్పారు. కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ శ్రేణుల్ని నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు చంద్రబాబు. …
Read More »AP Cabinet: వారం రోజుల గ్యాప్‌లో రెండోసారి భేటీ.. ఈ సారి ఆ నిర్ణయం పక్కా!
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం అక్టోబర్ 23వ తేదీ జరగనుంది. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాయం వేదికగా అక్టోబర్ 23వ తేదీ ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. ఈ విషయమై అన్ని ప్రభుత్వ శాఖలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ లేఖలు రాశారు. ఏపీ కేబినెట్ భేటీ నేపథ్యంలో అక్టోబర్ 21వ తేదీన సాయంత్రం 4 గంటలలోపు మంత్రివర్గ భేటీలో చర్చించాల్సిన అంశాలపై ప్రతిపాదనలు పంపాలని లేఖలో సూచించారు. మరోవైపు ఏపీ కేబినెట్ భేటీ ఇటీవలే జరిగింది. …
Read More »టీడీపీ కార్యకర్తలకు చంద్రబాబు బంపరాఫర్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు, ఈ చిన్న పని చేస్తే చాలు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కార్యకర్తలకు బంపరాఫర్ ఇచ్చారు. ఈ నెల 26 నుంచి టీడీపీ సభ్యత్వ నమోదు మొదలవుతుందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నలుగురు ఓటర్లలో ఒకర్ని సభ్యులుగా చేర్పించాలనే లక్ష్యంగా పెట్టుకోవాలని సూచనలు చేశారు. ఈ ఏడాది నుంచి కొత్తగా జీవితకాల సభ్యత్వాన్ని ప్రవేశపెడుతున్నామని గుర్తు చేశారు.. దీని కోసం రూ.లక్ష రుసుంగా నిర్ణయించామన్నారు. ఒకవేళ పార్టీ సభ్యులు ప్రమాదవశాత్తు మరణిస్తే ఇచ్చే బీమా మొత్తాన్ని రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచామన్నారు. అంతేకాదు చనిపోయిన కార్యకర్తల …
Read More »ఏపీలో మందుబాబులకు మరో షాక్.. ఇక లేనట్లేనా?, వాళ్లకు పండగే!
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మద్యం షాపులు ప్రారంభమయ్యాయి.. మూడు రోజులుగా అమ్మకాలు ఊపందుకున్నాయి. అయితే మద్యం షాపుల పక్కన పర్మిట్ రూమ్‌ల వ్యవహారం ఆసక్తికరంగా మారింది. కొత్త పాలసీలో ఈ పర్మిట్ రూమ్‌లను ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని పెట్టలేదు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడిందనే టాక్ వినిపిస్తోంది.. అంతేకాదు ఈ నిర్ణయం కారణంగా రూ.170 కోట్ల ఆదాయం కోల్పోయింది. ఈ నిర్ణయం బార్ల యాజమాన్యాలకు కలిసొస్తోంది.. షాపుల పక్కన మద్యం తాగేందుకు పర్మిట్ రూమ్‌లకు అనుమతి ఇవ్వకపోవడంతో బార్లకు ఆదాయం పెరిగే అవకాశం ఉంది. గతంలో …
Read More »