Coffee Day Shares: కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌కు భారీ ఊరట లభించింది. కంపెనీ దివాలా ప్రాసెస్ ప్రారంభించాలని NCLT ఇచ్చిన తీర్పుపై అప్పీలేట్ ట్రైబ్యునల్ స్టే విధించడంతో ఊపిరి పీల్చుకుంది. కేఫ్ కాఫీ డే పేరిట కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్ రిటైల్ చెయిన్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఒక కేసుకు సంబంధించి.. దివాలా ప్రక్రియ ప్రారంభించేందుకు నేషనల్ కంపనీ లా ట్రైబ్యునల్ ఆదేశాలు ఇవ్వగా.. తాజాగా దీనిపై అప్పీలేట్ ట్రైబ్యునల్ (NCLAT) బుధవారం రోజు స్టే విధించింది. కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, …
Read More »Blog Layout
టీడీపీ నేత పోస్టుతో ఆగిన ఐఏఎస్ పోస్టింగ్?.. ఉత్తర్వులను వెనక్కి తీసుకున్న ప్రభుత్వం
అనంతపురం జాయింట్ కలెక్టర్‌గా ఐఏఎస్ అధికారి డి. హరితకు ఇచ్చిన పోస్టింగ్‌ను ఏపీ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. డి. హరితను అనంతపురం జిల్లా జాయింట్ కలెక్టర్‌గా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఆమె ఇంకా జేసీగా రిపోర్టు చేయలేదు. అయితే ఈ లోపే ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుంది. పోస్టింగ్ రద్దు చేసిన ఏపీ ప్రభుత్వం.. హరితను సాధారణ పరిపాలనశాఖలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు …
Read More »భార్యతో కలిసి సామాన్యుడిలా విమాన ప్రయాణం చేసిన జగన్.. ఫొటో వైరల్
అమరావతి: అధికారంలో ఉన్నప్పుడు పరదాలు కట్టి ప్రజల్లోకి వెళ్లిన మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్(YS Jagan) ఇప్పుడు తాను సామాన్యమైన వ్యక్తినని కవరింగ్ ఇచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. జగన్ ఆయన భార్య భారతి కలిసి ఉన్న ఫొటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైసీపీ అధినేత సాధారణ వ్యక్తిలా విమానంలో భార్యతో కలిసి ప్రయాణించారు. గతంలో సీఎంగా ప్రత్యేక విమానాల్లో ప్రయాణించిన ఆయన ప్రస్తుతం సామాన్యుడిలా సాధారణ విమానాల్లో ఎకానమీ క్లాసులో ప్రయాణిస్తున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ …
Read More »గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియమాకం.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామాకాలపై తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. ఈ ఎమ్మెల్సీల నియమాకాల విషయంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. కొత్తగా ఎమ్మెల్సీలను నియమించకుండా కూడా స్టే విధించాలన్న పిటిషనర్ అభ్యర్ధనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. కొత్త ఎమ్మెల్సీల నియామకాన్ని అడ్డుకుంటే… గవర్నర్, ప్రభుత్వ హక్కులను హరించినట్లే అవుతుందని జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ ప్రసన్న బాలచంద్రల ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఎప్పటికప్పుడు నియామకాల చేపట్టడం ప్రభుత్వ విధి …
Read More »కశ్మీర్‌లో ముష్కర మూకల కోసం వేట.. ఆర్మీ కెప్టెన్ వీరమరణం
జమ్మూ కశ్మీర్‌లో ముష్కర మూకల కోసం గాలిస్తుండగా.. ఓ సైనికాధికారి అమరుడయ్యాడు. దోడా జిల్లాలో బుధవారం భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. అస్సార్ అలీ ప్రాంతంలో జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో 48వ రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన ఓ ఆర్మీ కెప్టెన్ వీరమరణం పొందాడు. ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టినట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఆపరేషన్ కొనసాగుతుంది. శివ్‌గఢ్-అస్సార్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్టు సమాచారం రావడంతో జమ్మూ కశ్మీర్ పోలీసులు, సైన్యం సంయుక్తంగా …
Read More »ఐటీఆర్- 1, 2, 3లో.. ఎవరికి ‘రీఫండ్’ త్వరగా వస్తుంది? ఆలస్యమైతే ఏం చేయాలి?
Tax Refunds: గత ఆర్థిక సంవత్సరం 2023-24 (అసెస్మెంట్ ఇయర్ 2024-25)కి సంబంధించి 7 కోట్లకుపైగా ఐటీ రిటర్నులు దాఖలయ్యాయి. వారంతా ఇప్పుడు తమ ట్యాక్స్ రీఫండ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే చాలా మంది రిటర్నులను ఐటీ శాఖ ప్రాసెస్ చేసి రీఫండ్స్ వారి ఖాతాల్లో జమ చేస్తోంది. అయితే, చాలా మందికి ఇంకా రీఫండ్ జమ కావడం లేదు. ఐటీ రిటర్నులు దాఖలు చేసేందుకు ఐటీఆర్-1 ఫారం, ఐటీఆర్-2, ఐటీఆర్-3 ఫారం ఎంచుకుంటారు. మీరు ఐటీఆర్ 2, ఐటీఆర్ 3 ఎంచుకున్నట్లయితే ఇప్పటి …
Read More »ఐటీ-ఎలక్ట్రానిక్స్ , ఆర్టీజీ శాఖలపై నేడు చంద్రబాబు సమీక్ష
ఐటీ-ఎలక్ట్రానిక్స్ , ఆర్టీజీ శాఖలపై నేడు సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. ఐటీ పెట్టుబడులను ఏపీ రప్పించేలా కొత్త ఐటీ పాలసీ రూపకల్పనపై చర్చ జరగనుంది. విశాఖ కేంద్రంగా ఐటీ పరిశ్రమల ఏర్పాటుకు కసరత్తు నిర్వహించనున్నారు. అమరావతి: ఐటీ-ఎలక్ట్రానిక్స్ , ఆర్టీజీ (రియల్ టైమ్ గవర్నెన్స్) శాఖలపై నేడు సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. ఐటీ పెట్టుబడులను ఏపీకి రప్పించేలా కొత్త ఐటీ పాలసీ రూపకల్పనపై ఈ సమీక్షలో చర్చ జరగనుంది. విశాఖ కేంద్రంగా ఐటీ పరిశ్రమల ఏర్పాటుపై మాట్లాడనున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఏపీ …
Read More »ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. మళ్లీ ఫోన్ పేలో కరెంట్ బిల్లులు చెల్లించొచ్చు
ఏపీ ప్రజలకు శుభవార్త.. కరెంట్ బిల్లుల చెల్లింపు విషయంలో ఏపీసీపీడీసీఎల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఫోన్ పే ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించొచ్చని ప్రకటించింది. ఇటీవల ఫోన్‌పే, గూగుల్ పే వంటి డిజిటల్ చెల్లింపులకు డిస్కంలు గుడ్ బై చెప్పాయి. అయితే ఒక్క నెలలోనే సీన్ మొత్తం రివర్స్ అయ్యిందట.. కరెంట్ బిల్లుల చెల్లింపులు భారీగా తగ్గిపోవటంతో అధికారులు అవాక్కయ్యారు. ఈ కారణంగా ఉన్నతాధికారులు ఫోన్ పే చెల్లింపులు తిరిగి పునరుద్ధరించినట్లు తెలిపారు. ఏపీలో ఇకపై విద్యుత్‌పంపిణీ సంస్థ ఏపీసీపీడీసీఎల్ యాప్, వెబ్‌సైట్‌తో పాటు …
Read More »దీనిపై కఠినంగా ఉండండి: చంద్రబాబు
జీవో 117పై నివేదిక ఇవ్వండి విద్యార్థులకు స్పోర్ట్స్ రిపోర్టులు ప్రతి విద్యార్థికీ ప్రత్యేకంగా ఐడీ విద్యాశాఖలో సమూల మార్పులు సమీక్షలో సీఎం చంద్రబాబు అమరావతి: విద్యా శాఖలో సమూల మార్పులు జరగాలని, ఉత్తమ ఫలితాల సాధన లక్ష్యంగా పనిచేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. పాఠశాల విద్యాశాఖపై ప్రభుత్వం రూ.32 వేల కోట్లు ఖర్చు చేస్తోందని, క్షేత్రస్థాయిలో ఆ మేరకు ఫలితాలు కనిపించాలన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని సిలబ్‌సలో మార్పులు చేయాలని సూచించారు. దీనికోసం విద్యారంగ నిపుణులు, మేధావులు, ప్రముఖులతో …
Read More »చెన్నై టు విశాఖపట్నం వయా సికింద్రాబాద్.. ఆ బ్యాగు అక్కడికి చేరింది, ఆ దొంగ మంచి చేసినట్లేనా!
చెన్నై టు సికింద్రాబాద్ ఏంటి.. బ్యాగు విశాఖకు చేరడం ఏంటి అనుకుంటున్నారా?.. అవును సినిమా రేంజ్‌లో ఓ స్టోరీ జరిగింది. ఓ ఉద్యోగికి సంబంధించి బ్యాగు కహానీ ఇది. చెన్నైలో మొదలై సికింద్రాబాద్ మీదుగా విశాఖపట్నానికి చేరింది. తమిళనాడు రాజధాని చెన్నైకి చెందిన కార్తికేయన్‌కు హైదరాబాద్‌లో ఉద్యోగం వచ్చింది. ఈనెల 8న యువకుడు ఉద్యోగంలో చేరేందుకు శబరి ఎక్స్‌ప్రెస్‌లో కాట్పాడి నుంచి సికింద్రాబాద్ బయలుదేరాడు. రైలులో కార్తికేయన్ నిద్రలోకి జారుకున్నారు.. ఆ తర్వాత కొంతసేపటికి లేచి చూస్తే అతడి బ్యాగు మాయమైంది. నిద్రలేచిన కార్తికేయన్.. …
Read More »