rednews
August 10, 2024 తెలంగాణ
44
తెలంగాణలోని మహిళామణులందరికీ ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న టీజీఎస్‌ఆర్‌టీసీ మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆగస్టు 19వ తేదీన రాఖీ పండుగ సందర్భంగా.. ఆడపడచులకు ప్రత్యేక ఆఫర్ ఇచ్చింది. ఆడపడుచుల కోసం ఆర్టీసీ లాజిస్టిక్స్ ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయాలని యాజమాన్యం నిర్ణయించింది. రక్షా బంధన్ సందర్భంగా.. ఆడపడుచులు తమ అన్నదమ్ముళ్లకు రాఖీలు కట్టడం ఆనవాయితీ. అయితే కొందరు పుట్టింటికి, అన్నదమ్ములకు చాలా దూరంలో ఉండటమో.. అనివార్య పరిస్థితుల వల్ల వెళ్లలేకపోవటమో జరుగుతుంటాయి. అలాంటి సందర్భాల్లో.. ఆ అక్కాచెల్లెల్లు.. పోస్ట్ లేదా …
Read More »
rednews
August 10, 2024 ఆంధ్రప్రదేశ్, ఎన్టీఆర్
47
ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో విచిత్రమైన ఘటన జరిగింది. పట్టణంలోని ఓ ఏటీఎంలో నుంచి నోట్ల వర్షం కురిసింది. స్థానికంగా ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంలో రూ.5వేలు డ్రా చేస్తే రూ.7వేలు వచ్చాయి. ఈ విషయం ఆ నోటా ఈ నోటా అందరికి తెలియడంతో.. కొందరు కస్టమర్లు ఏటీఎంకు వచ్చి డబ్బులు డ్రా చేసుకుని వెళ్లారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు బ్యాంకు అధికారులతో కలిసి ఏటీఎంను మూసివేయించారు. సాంకేతిక సమస్య కారణంగా ఇలా జరిగిందని తెలుస్తోంది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. ఆ తర్వాత …
Read More »
rednews
August 10, 2024 ఆంధ్రప్రదేశ్, పాలిటిక్స్
64
కుటుంబ వివాదంపై వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ స్పందించారు. విలేకర్ల సమావేశం నిర్వహించిన దువ్వాడ శ్రీనివాస్.. కీలక వ్యాఖ్యలు చేశారు. తన భార్య వాణి అహంకారంతో వ్యవహరిస్తూ.. తనపై కూతుర్లకు ద్వేషం నూరిపోశారని ఆరోపించారు. ప్రతి ఇంట్లోనూ గొడవలు సహజమేనన్న దువ్వాడ శ్రీను.. వాటిని నాలుగు గోడల మధ్యనే పరిష్కరించుకోవాలన్నారు. వ్యాపారంతో పాటుగా రాజకీయాల్లో కూడా తానే ఉండాలని వాణి అహంకారంతో వ్యవహరించిందని.. కుమార్తెలకు తనపై ద్వేషం నింపిందన్నారు. వైఎస్ జగన్ తనకు టెక్కలి టికెట్ ప్రకటిస్తే.. తనకు కావాలని వాణి పట్టుబట్టిందన్నారు. విడాకులు …
Read More »
rednews
August 10, 2024 ఆంధ్రప్రదేశ్, తిరుపతి
47
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్యమైన గమనిక. ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకు పవిత్రోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. తిరుమల ఆలయంలో ఆగస్టు 14న అంకురార్పణంతో ఈ పవిత్రోత్సవాలు ప్రారంభమవుతాయి. ఏడాది పొడవునా శ్రీవారి ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్ల గానీ, సిబ్బంది వల్లగానీ తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. పవిత్రోత్సవాలు తిరుమలలో 15-16 శతాబ్దాల వరకు జరిగినట్టు ఆధారాలున్నాయి. 1962వ సంవత్సరం నుంచి దేవస్థానం …
Read More »
rednews
August 9, 2024 తెలంగాణ
52
తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావటమే లక్ష్యంగా.. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఆగస్టు 3వ తేదీన మొదలైన సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఆగస్టు 14 వరకు మొత్తం పది రోజుల పాటు కొనసాగనుంది. ఈ పర్యటనలో భాగంగా.. మొదట అమెరికాకు వెళ్లిన రేవంత్ రెడ్డి బృందానికి ఘన స్వాగతం లభించింది. మొదటి రోజు నుంచే రేవంత్ టీం.. ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో భేటీ అవుతూ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే.. రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువ కొనసాగుతోంది. పెద్ద …
Read More »
rednews
August 9, 2024 అమరావతి, ఆంధ్రప్రదేశ్
66
ఏపీలో మహిళలకు త్వరలోనే ప్రభుత్వం శుభవార్త వినిపించనుంది. ఈ విషయాన్ని ఏపీ రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై సీఎం నారా చంద్రబాబు నాయుడు సమీక్షించనున్నారు. ఆగస్ట్ 12వ తేదీన ఆర్టీసీ, రవాణాశాఖపై చంద్రబాబు సమీక్షిస్తారని ఏపీ రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం హామీ అమలుపైనా చంద్రబాబు చర్చిస్తారని తెలిపారు. టీడీపీ ప్రభుత్వం త్వరలోనే ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటుందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి …
Read More »
rednews
August 9, 2024 క్రైమ్, జాతీయం
67
Independence Day: దేశంలో భారీ ఉగ్ర కుట్రను ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదిని తాజాగా అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే ఆ ఉగ్రవాది వద్ద నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. దేశంలో పంద్రాగస్టు వేడుకలకు ముందు దేశ రాజధాని ఢిల్లీలో భారీ ఉగ్ర కుట్రకు ఉగ్రవాదులు తెరలేపగా.. వాటిని ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. అయితే ఆ ఉగ్రవాది.. భారత ప్రభుత్వం వాంటెడ్ లిస్ట్‌లో ఉండటం గమనార్హం. అతడి కోసం వెతుకుతుండగా.. తాజాగా ఢిల్లీలో ఆయుధాలతో పట్టుబడటం తీవ్ర …
Read More »
rednews
August 9, 2024 ఆంధ్రప్రదేశ్, పాలిటిక్స్, సినిమా
60
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్ కళ్యాణ్ అటవీ పరిరక్షణ గురించి మాట్లాడుతూ పుష్ప సినిమాపై ఇండైరెక్ట్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో హీరోలు అడవిని కాపాడే సినిమాలు, పాత్రలు చేశారని.. ఇప్పుడు మాత్రం సినిమాల్లో హీరో అదే చెట్లను నరికేసి, స్మగ్లింగ్ చేస్తున్నాడంటూ పవన్ అన్నారు. ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వెంటనే వైరల్ అయిపోయాయి. పవన్ ఇండైరెక్ట్‌గా పుష్ప సినిమాకి, అల్లు అర్జున్‌కి కౌంటర్ ఇచ్చారంటూ వార్తలు రాసేశారు. ఇక దీనిపై బన్నీ అభిమానులు కూడా రియాక్ట్ అవుతున్నారు. నిన్నటి …
Read More »
rednews
August 9, 2024 Business, బిజినెస్
64
UPI Downtime: ప్రస్తుతం మన దేశంలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) లావాదేవీలు భారీగా పెరిగాయి. నిత్యం కోట్లాది ట్రాన్సాక్షన్లు జరుగుతున్నాయి. కిరాణ దుకాణం నుంచి పెద్ద పెద్ద అవసరాలకు సైతం యూపీఐ చేసే వెసులుబాటు ఉండడంతో గూగుల్ పే, ఫోన్, పే, పేటీఎం వంటి వాటి వినియోగం పెరిగింది. అయితే, బ్యాంక్ ఖాతాదారులు తమ బ్యాంక్ తీసుకునే నిర్ణయాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. తాజాగా దేశీయ దిగ్గజ ప్రైవేట్ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కీలక ప్రకటన చేసింది. సిస్టమ్ మెయింటనెన్స్ కారణంగా యూపీఐ …
Read More »
rednews
August 9, 2024 ఆంధ్రప్రదేశ్, కాకినాడ
61
ఏపీలో వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. పిఠాపురంలో పెండెం దొరబాబు, అనంతపురంలో పైలా నర్సింహయ్య రాజీనామాలు చేసిన ఘటనలు మరువకముందే మరో కీలక నేత ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. వైసీపీకి మాజీ డిప్యూటీ సీఎం, ఏలూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని) రాజీనామా చేశారు. ఏలూరు జిల్లా అధ్యక్ష పదవితో పాటుగా.. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆళ్ల నాని ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతో ప్రత్యక్ష రాజకీయాలకు ఇకపై దూరంగా …
Read More »