TimeLine Layout

July, 2024

  • 24 July

    తిరుమలలో భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం.. 

    తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు టీటీడీ నిర్దేశించిన రేట్లకే వాటర్ బాటిళ్లు విక్రయించాలని జేఈవో (విద్య, ఆరోగ్యం) గౌతమి చెప్పారు. తిరుమలలోని ఆరోగ్యశాఖ కార్యాలయంలో మంగళవారం దుకాణదారులతో సమావేశం నిర్వహించారు. తిరుమలలోని దుకాణదారులు టీటీడీ నిర్దేశించిన రేట్ల కంటే అధిక రేట్లకు వాటర్ బాటిళ్లు అమ్ముతున్నారని, కాళీ గాజు బాటిళ్లు తీసుకోవడం లేదని పలువురు భక్తులు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. టీటీడీ ఈవో ఆదేశాల మేరకు, తిరుమలలోని దుకాణదారులతో సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తిరుమలలోని అన్ని దుకాణాలలో ఒకే రేటుతో వాటర్ బాటిళ్లు …

    Read More »
  • 20 July

    ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ వివాదం వేళ యూపీఎస్సీ ఛైర్మన్ మనోజ్ సోని రాజీనామా

    UPSC: యూపీఎస్సీ ఛైర్మన్ మనోజ్ సోని రాజీనామా చేశారు. ఇంకా 5 ఏళ్ల పదవీ కాలం ఉండగానే మనోజ్ సోని.. తన పదవికి రాజీనామా చేయడం ప్రస్తుతం తీవ్ర ఊహాగానాలకు దారి తీస్తోంది. అయితే గత ఏడాది యూనియన్ పబ్లిక్ కమిషన్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన మనోజ్ సోని.. ఉన్నట్టుండి రాజీనామా చేయడం కీలకంగా మారింది. మరోవైపు.. ఇటీవల కొన్ని రోజులుగా ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ వివాదం కొనసాగుతుండగా.. ఈ సమయంలో యూపీఎస్సీ ఛైర్మన్ రాజీనా చేయడం తీవ్ర చర్చకు దారి తీసింది. …

    Read More »
  • 20 July

    వైఎస్ జగన్‌కు ఎవరు ఇలాంటి సలహాలు ఇస్తున్నారో….?

    వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు విమర్శలు గుప్పించారు. వైఎస్ జగన్ శవ రాజకీయాలు చేయడం ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు. వినుకొండ పర్యటనలో ఏపీ ప్రభుత్వం మీద వైఎస్ జగన్ చేసిన ఆరోపణలకు నాగబాబు కౌంటర్ ఇచ్చారు. జగన్ వ్యాఖ్యలను తిప్పికొడుతూ నాగబాబు వీడియో విడుదల చేశారు. వినుకొండ రషీద్ హత్యకు రాజకీయాలతో సంబంధం లేదన్న నాగబాబు.. పాత పగల కారణంగా ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవలో రషీద్ హత్యకు …

    Read More »
  • 20 July

    ఏపీలో దంచికొడుతున్న వానలు.. మరో రెండు రోజులు ఇంతే.. 

    అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కోస్తాంధ్ర జిల్లాలలో భారీ వానలు పడుతున్నాయి. ఈ క్రమంలోనే ఆదివారం కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా శనివారం, ఆదివారం అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని ప్రకటించింది. ఒడిశా, ఉత్తరాంధ్ర తీరంలో తీవ్ర అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారిందని.. దీని ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, నంద్యాల, ఏలూరు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడా …

    Read More »
  • 20 July

    వైఎస్ జగన్-సాయిరెడ్డి మధ్య ‘శాంతి’పై చర్చ.. వివరణ

    తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న ‘శాంతి’ ఇష్యూపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఎంపీ విజయసాయిరెడ్డి మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. ఈ వ్యవహారంపై జగన్‌కు సాయిరెడ్డి వివరణ ఇచ్చుకున్నారు. అసలేం జరిగిందంటే..? తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైసీపీ ఎంపీలతో.. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమావేశం వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి మందు.. వైఎస్ జగన్- ఎంపీ విజయసాయి సాయిరెడ్డిల మధ్య ఆసక్తికర చర్చ సమావేశానికంటే ముందే జగన్‌తో అరగంట పాటు.. విడిగా సాయిరెడ్డి, మిథున్ …

    Read More »
  • 20 July

    నేడు ఎంపీలతో చంద్రబాబు సమావేశం

    జులై 22 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ ఎంపీలతో పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు ఇవాళ సమావేశం కానున్నారు. ఉండవల్లిలోని తన నివాసంలో శనివారం మధ్యాహ్నం ఈ భేటీ జరగనుంది. జులై 22 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ ఎంపీలతో పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు (Chandrababu) ఇవాళ సమావేశం కానున్నారు. ఉండవల్లిలోని తన నివాసంలో శనివారం మధ్యాహ్నం ఈ భేటీ జరగనుంది. సమావేశానికి టీడీపీ (TDP) ఎంపీలు, కేంద్రమంత్రులు …

    Read More »
  • 20 July

    ఒకేరోజు రూ.8 లక్షల కోట్లు ఆవిరి

    వరుస లాభాలతో రికార్డు గరిష్టాలకు చేరుకున్న దేశీయ సూచీలకు శుక్రవారం చాలా పెద్ద దెబ్బ తగిలింది. సెన్సెక్స్, నిఫ్టీతో పాటు మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు బాగా కరెక్ట్ అయ్యాయి. మైక్రోసాఫ్ట్ విండోస్‌లో తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంగా అంతర్జాతీయంగా విమానయాన, బ్యాంకింగ్ రంగాలు తీవ్ర అంతరాయం ఎదుర్కొన్నాయి. వరుస లాభాలతో రికార్డు గరిష్టాలకు చేరుకున్న దేశీయ సూచీలకు (Stock Market) శుక్రవారం చాలా పెద్ద దెబ్బ తగిలింది. సెన్సెక్స్ (Sensex), నిఫ్టీ (Nifty)తో పాటు మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు బాగా కరెక్ట్ …

    Read More »
  • 20 July

    తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ ఈవో గుడ్‌న్యూస్

    తిరుమలలో ప్రక్షాళన కొనసాగుతోందన్నారు టీటీడీ ఈవో జే శ్యామలరావు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనలతో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టామని.. తాను ఈవోగా బాధ్యతలు తీసుకున్ని నెల రోజుల్లో ఎన్నో లోపాలను గుర్తించినట్లు చెప్పారు. క్షేత్రస్థాయిలో పరిశీలన తర్వాత మార్పులు, చేర్పులు చేయాల్సిన అవసరం ఉందని.. సీఎం సూచనలకు తగిన విధంగా తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. తిరుమల శ్రీవారి ఆన్‌లైన్ దర్శన టిక్కెట్ల జారీ వ్యవస్థలో లోపాలు ఉన్నాయని.. త్వరలోనే ఆన్‌లైన్ టికెట్ల వ్యవస్థలో అవసరమైన …

    Read More »
  • 20 July

    సుప్రీంకోర్టు ఆదేశం.. సెంటర్ల వారిగా నీట్ ఫలితాలు ప్రకటించిన ఎన్టీఏ

    సుప్రీంకోర్టు ఆదేశాలతో నీట్ యూజీ పరీక్ష ఫలితాలను సెంటర్ల వారీగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీయే) శనివారం ఉదయం వెలువరించింది. వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ పరీక్షపై దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేగుతున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై సర్వోన్నత న్యాయస్థానంలో పలు పిటిషన్ల దాఖలు కాగా.. వాటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్ధీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ కొనసాగిస్తోంది. గురువారం నాటి విచారణలో కేంద్రాల వారీగా పరీక్ష …

    Read More »
  • 20 July

    హార్దిక్‌కు మరోషాక్..!

    టీ20 ప్రపంచకప్ 2024లో ఛాంపియన్‌గా నిలివడం మినహా.. టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకు గత ఏడాది కాలంగా ఏదీ కలిసి రావడం లేదు. ఆట పరంగా, వ్యక్తిగతంగా అతడు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నాడు. వాస్తవానికి గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా నియమితుడయ్యాక.. హార్దిక్ పాండ్యా ఫేట్ మారిపోయింది. తొలి సీజన్‌లోనే గుజరాత్ ఛాంపియన్‌గా నిలవడం.. రెండో సీజన్‌లోనూ ఫైనల్ చేరడంతో పాండ్యా కెప్టెన్సీపై ప్రశంసలు వచ్చాయి. భారత జట్టుకు సైతం భవిష్యత్ కెప్టెన్ అతడే అనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. కానీ ఐపీఎల్ …

    Read More »