ఒకేరోజు రూ.8 లక్షల కోట్లు ఆవిరి

వరుస లాభాలతో రికార్డు గరిష్టాలకు చేరుకున్న దేశీయ సూచీలకు శుక్రవారం చాలా పెద్ద దెబ్బ తగిలింది. సెన్సెక్స్, నిఫ్టీతో పాటు మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు బాగా కరెక్ట్ అయ్యాయి. మైక్రోసాఫ్ట్ విండోస్‌లో తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంగా అంతర్జాతీయంగా విమానయాన, బ్యాంకింగ్ రంగాలు తీవ్ర అంతరాయం ఎదుర్కొన్నాయి.

వరుస లాభాలతో రికార్డు గరిష్టాలకు చేరుకున్న దేశీయ సూచీలకు (Stock Market) శుక్రవారం చాలా పెద్ద దెబ్బ తగిలింది. సెన్సెక్స్ (Sensex), నిఫ్టీ (Nifty)తో పాటు మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు బాగా కరెక్ట్ అయ్యాయి. మైక్రోసాఫ్ట్ (Microsoft) విండోస్‌లో తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంగా అంతర్జాతీయంగా విమానయాన, బ్యాంకింగ్ రంగాలు తీవ్ర అంతరాయం ఎదుర్కొన్నాయి. దీంతో ఆయా రంగ స్టాక్‌లు నష్టపోయాయి. అంతర్జాతీయంగా పలు దేశాల స్టాక్ మార్కెట్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.

పై కారణాలతో పాటు బడ్జెట్ రోజు కూడా సమీపిస్తుండడంతో మదుపర్లు అప్రమత్తమయ్యారు. గరిష్టాల వద్ద లాభాల స్వీకరణకు దిగారు. అలాగే రిలయన్స్ వంటి హెవీ వెయిట్ షేర్లలో అమ్మకాలు కూడా సూచీలను కిందకు లాగేశాయి. దీంతో ఈ వారంలోనే జీవన కాల గరిష్టాలకు చేరుకున్న సూచీలు వారాంతంలో కిందకు దిగి రాక తప్పలేదు. దీంతో మదుపర్లు సంపదగా భావించే బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల విలువ ఏకంగా రూ.7.9 లక్షల కోట్లు తరిగిపోయింది. బీఎస్‌లో నమోదైన కంపెనీల్లో ఏకంగా 3071 షేర్లు నష్టాల బాటలోనే సాగాయి.

వచ్చే వారం దేశీయ సూచీలను పూర్తిగా కేంద్ర బడ్జెట్ నడిపించనుంది. వివిధ రంగాలకు కేంద్రం కేటాయింపులను బట్టి ఆయా రంగాల షేర్లలో కదలిక కనిపించే ఛాన్స్ ఉంది. ఉత్పత్తి, ఇన్‌ఫ్రా, గ్రామీణ అభివృద్ధి, వ్యవసాయ, ఇందన, ఎఫ్‌‌ఎఎమ్‌సీజీ రంగాలకు ఆర్థిక మంత్రి గుడ్ న్యూస్ చెప్పే ఛాన్స్ ఉందని వార్తలు వెలువడుతున్నాయి. అలాగే ఇప్పటికే వెలువడిన, త్వరలో వెలువడనున్న త్రైమాసిక ఫలితాలు కూడా సూచీలను నడిపించనున్నాయి. ఐటీ కంపెనీల లాభాలు పెరుగుతుండడం సానుకూలాంశం.

About rednews

Check Also

Dana Cyclone: ఏపీపై దానా తుఫాన్‌పై ప్రభావం.. ఈ జిల్లాల్లో వర్షాలు

వాయవ్య బంగాళాఖాతంలో దానా తీవ్ర తుఫాన్‌గా బలపడి హబాలిఖాతి నేచర్ క్యాంప్‌ (భిత్తర్కనిక)-ధమ్రాకు సమీపంలో తీరం దాటినట్లు ఏపీ విపత్తుల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *