టిక్కెట్ లేకుండా రైలు ఎక్కిన ఓ ప్రయాణికుడు.. టీటీఈ బెదిరించాడు. టిక్కెట్ ఏదని అడిగితే.. తనకు కేంద్ర మంత్రి తెలుసంటూ బుకాయించే ప్రయత్నం చేశాడు. దీంతో టీటీఈ సహా తోటి ప్రయాణికులంతా విస్తుపోయారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని మథుర జంక్షన్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రైల్లో టిక్కెట్ లేకుండా ప్రయాణించేవారిని గుర్తించేందుకు మథుర జంక్షన్ వద్ద అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ధోలాపుర్ నుంచి వస్తున్న ఓ ప్రయాణికుడ్ని రైల్వే స్టేషన్‌లో టీటీఈ ఆపి టికెట్ చూపించమని అడిగారు. టిక్కెట్ లేకుండా …
Read More »TimeLine Layout
July, 2024
-
20 July
జమ్మలమడుగులోని పొలాల్లో సిరంజీల కలకలం..
కడప జిల్లా జమ్మలమడుగులో సిరంజీలు కలకలంరేపాయి. జమ్మలమడుగు బైపాస్ నుంచి శేషారెడ్డిపల్లె వెళ్లే మార్గంలో పొలాల గట్ల వెంట వాడి పడేసిన సిరంజీలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. రైల్వే గేటు దాటగానే రోడ్డు పక్కన 2.5 ఎం.ఎల్ సిరంజీలు సూదితో సహా గుర్తు తెలియని వ్యక్తులు పడేశారు. పొలాల్లో, గట్లపై ఈ సిరంజీలు ఉండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సిరంజీలు రక్త పరీక్షలవా? మత్తు పదార్థాల కోసం వాడినివా? అనే అనుమానాలు మొదలయ్యాయి. గతంలో ఇలాంటి సిరంజీలు ఎప్పుడూ చూడలేదని రైతులు, …
Read More » -
20 July
మైక్రోసాఫ్ట్ విండోస్ సమస్యపై స్పందించిన సత్య నాదెళ్ల: ఏమన్నారంటే?
వాషింగ్టన్: మైక్రోసాఫ్ట్ విండోస్ (Microsoft Windows)లో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా ప్రపంచ వ్యాప్తంగా అనేక సేవలు తాత్కాలికంగా నిలిచిపోయిన విషయం తెలిసిందే. కంప్యూటర్లలో బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ కనిపించడంతో సిస్టంలు షట్‌డౌన్/రీస్టార్ట్ అయ్యాయి. ఈ క్రమంలో క్రౌడ్ స్ట్రైక్ అప్‌డేట్ చేయడం వల్లే సాంకేతిక సమస్య తలెత్తినట్లు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. ఈ విషయంపై తాజాగా, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల (Satya Nadella) స్పందించారు. నిన్న క్రౌడ్ స్ట్రైక్ విడుదల చేసిన అప్‌డేట్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా కంప్యూటర్లలో సాంకేతిక …
Read More » -
20 July
సింహాచలంలో నేడు గిరి ప్రదక్షిణ మహోత్సవం
సింహాచలం, న్యూస్‌టుడే: శ్రీవరాహలక్ష్మీనృసింహ స్వామి కొలువైన విశాఖ జిల్లా సింహాచలం క్షేత్రంలో శనివారం గిరి ప్రదక్షిణ మహోత్సవం వైభవోపేతంగా ప్రారంభం కానుంది. ఏటా ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకుని చతుర్దశినాడు లక్షల మంది భక్తులు సింహాచల పుణ్యక్షేత్రానికి వస్తారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం నాలుగు గంటలకు కొండ దిగువన తొలి పావంచా వద్ద నుంచి అప్పన్నస్వామి పుష్పరథం గిరి ప్రదక్షిణకు బయలుదేరుతుంది. పౌర్ణమి సందర్భంగా ఆదివారం వేకువజామున సింహాద్రినాథుడికి తుది విడత చందన సమర్పణ చేస్తారు.
Read More » -
20 July
మహిళలకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు
ఆభరణాల వ్యాపారుల నుండి బలహీనమైన డిమాండ్ కారణంగా, జాతీయ రాజధాని బులియన్ మార్కెట్‌లో శనివారం బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. తులం బంగారంపై రూ.300 నుంచి రూ.500 వరకు తగ్గుముఖం పట్టింది. దేశీయంగా బంగారం ధరల్లో ప్రతి రోజు హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్నాయి. విదేశీ మార్కెట్ కామెక్స్‌లో శనివారం వరుసగా నాలుగో సెషన్‌లో బంగారం తక్కువగా ట్రేడవుతోంది. అయితే జూలై 20వ తేదీన దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర …
Read More » -
20 July
రాశిఫలాలు 20 జూలై 2024
horoscope today 20 July 2024 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శనివారం రోజున చంద్రుడు ధనస్సు రాశిలో సంచారం చేయనున్నాడు. ఈరోజు ద్వాదశ రాశులపై పూర్వాషాఢ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే సమయంలో చతుర్దశి తిథి రోజున ద్విగ్రాహి యోగం, రవి యోగం, శుక్రాదిత్య యోగం వంటి శుభ యోగాలతో కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు రానున్నాయి. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు అదృష్టం రానుంది. 12 రాశుల …
Read More » -
20 July
ఏపీలోని ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు.. భారీ వర్షాలతో అధికారుల కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్‌ను వర్షాలు ముంచెత్తాయి.. రెండు రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒడిశా,ఉత్తరాంధ్ర తీరప్రాంతంలోని అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారింది. ఇది వాయువ్య దిశగా పయనించి పూరీ సమీపంలో ఒడిశాతీరం దాటే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, ఏలూరు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందంటున్నారు. కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, …
Read More » -
20 July
పంచాంగం • శనివారం, జులై 20, 2024
విక్రం సంవత్సరం – పింగళ 2081, ఆషాఢము 15 ఇండియన్ సివిల్ క్యాలెండర్ – 1946, ఆషాఢము 29 పుర్నిమంతా – 2081, ఆషాఢము 28 అమాంత – 2081, ఆషాఢము 15 తిథి శుక్లపక్షం చతుర్దశి – Jul 19 07:41 PM – Jul 20 05:59 PM శుక్లపక్షం పూర్ణిమ – Jul 20 05:59 PM – Jul 21 03:47 PM నక్షత్రం పూర్వాషాఢ – Jul 20 02:55 AM – Jul 21 01:48 AM ఉత్తరాషాఢ – Jul 21 01:48 AM – Jul 22 12:14 AM అననుకూలమైన సమయం …
Read More » -
19 July
రియల్‌మీ జీటీ 6టీ వచ్చేస్తోంది.. ఈనెల 20 నుంచి సేల్స్ ప్రారంభం
Realme GT 6T Specifications : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ రియల్‌మీ మరో కొత్త ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకురానుంది. రియల్‌మీ జీటీ 6టీ (Realme GT 6T) పేరిట మరో ఫోన్‌ను కలర్ ఆప్షన్‌లో త్వరలో భారత్ మార్కెట్లోకి తీసుకురానుంది. త్వరలో అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ (Amazon Prime Day Sale 2024) ప్రారంభం కానున్న నేపథ్యంలో రియల్‌మీ తన రియల్‌మీ జీటీ 6టీ ఫోన్‌ను మరో కలర్ ఆప్షన్ లో తీసుకొస్తోంది. ఈఏడాది మే నెలలో రియల్‌మీ జీటీ 6టీ …
Read More » -
19 July
ఐటీ ఉద్యోగులకు అలర్ట్..అటెండెన్స్‌తో లీవ్స్‌కి లింక్
IT Employees: దేశీయ మూడో అతిపెద్ద సాఫ్ట్‌వేర్ ఎగుమతి కంపెనీ హెచ్‌సీఎల్ టెక్ (HCL Tech) మరోసారి కఠిన నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులను ఆఫీసులకు రప్పించేందుకు కొత్త పాలసీని తీసుకొచ్చింది. ఆఫీసు అటెండెన్స్‌తో సెలవులకు లింక్ పెట్టింది. అంటే ఆఫీసుకు వచ్చిన వారికి మాత్రమే లీవ్స్ ఉంటాయి. ఆఫీసుకు రాని వారికి శాలరీలో కోత పడనుంది. ఈ మేరకు ఈ విషయానికి సంబంధం ఉన్న వ్యక్తులు వెల్లడించినట్లు మనీకంట్రోలో ఓ కథనం ప్రచురించింది. ఆ వివరాలు తెలుసుకుందాం. కరోనా మహమ్మారి ప్రభావం తగ్గిన తర్వాత …
Read More »