TimeLine Layout

October, 2024

  • 9 October

    విజయవాడ దుర్గ గుడిలో భక్తుడి చేతికి పెద్ద గోల్డ్ బ్రాస్‌లెట్.. అందరి కళ్లు అటువైపే, విలువ ఎంతో తెలుసా!

    విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ప్రతిరోజూ అమ్మవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. అయితే చిత్తూరు జిల్లాకు చెందిన ఓ భక్తుడి చేతికి ఉన్న బ్రాస్‌లెట్‌ అందరినీ ఆకట్టుకుంది. చిత్తూరు జిల్లాకు చెందిన రవి విజయవాడలోని ఇంద్రకీలాద్రికి అమ్మవారి దర్శనం కోసం వచ్చారు. ఆయన చేతికి పెద్ద బ్రాస్‌లెట్ ఉంది.. దీని బరువు ఏకంగా 1.300 కిలోలు.. విలువ సుమారు రూ.కోటి పైమాటేనని ఆయన చెబుతున్నారు. ఇంద్రకీలాద్రిపై రవి చేతికి ఉన్న ఈ బ్రాస్‌లెట్‌ను భక్తులు ఆసక్తిగా తిలకించారు. మరోవైపు ఇవాళ …

    Read More »
  • 9 October

    తిరుమలలో హోటల్స్ సీజ్, లైసెన్స్‌లు రద్దు.. టీటీడీ సంచలన నిర్ణయం

    తిరుమ‌ల‌లో నిబంధ‌న‌లు పాటించ‌ని హోట‌ల్స్, వాహ‌నాల‌పై టీటీడీ ఎస్టేట్, ర‌వాణా విభాగాలు చ‌ర్య‌లు తీసుకున్నాయి. తిరుమలలో టీటీడీ ఎస్టేట్ అధికారి ఆకస్మిక తనిఖీలు నిర్వ‌హించ‌గా భక్తులకు అధిక ధరలకు తినుబండాలు విక్రయిస్తూ, పరిశుభ్రత లేని పలు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, షాపుల్ని అధికారులు సీజ్ చేశారు. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు దేశ విదేశాల నుంచి భక్తులు వస్తుండటంతో తనిఖీలు నిర్వహించారు. ముందుగా పీఏసీ- 2 (మాధవ నిలయం) వద్ద అధిక ధరలకు విక్రయిస్తున్న ఒక టీ దుకాణం, రెండు ఫ్యాన్సీ షాపులను సీజ్ …

    Read More »
  • 9 October

    ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. కొత్త రేషన్ కార్డులపై ప్రభుత్వం కీలక నిర్ణయం

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన పేదలకు త్వరలో కొత్త రేషన్‌ కార్డులు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. అలాగే ఇప్పటికే ఉన్న కార్డుల్లో కుటుంబసభ్యుల మార్పులు, చేర్పులకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు వచ్చే కేబినెట్ సమావేశంలో రేషన్ కార్డుల అంశంపై నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్రంలో కొత్తగా రేషన్‌ కార్డుల జారీ, పౌర సరఫరాల శాఖలో ఇతర సమస్యల పరిష్కారంపై ఫోకస్ పెట్టింది. కొత్త రేషన్‌ కార్డుల మంజూరు, కుటుంబాల విభజన, కుటుంబ సభ్యుల చేర్పు, …

    Read More »
  • 8 October

    కొండెక్కిన టమాటా, ఉల్లి ధరలు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

    తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు కొండెక్కి కూర్చున్న సంగతి తెలిసిందే. భారీ వర్షాలు, వరదల కారణంగా కూరగాయల రేట్లు అమాంతం పెరిగిపోయాయి. మరీ ముఖ్యంగా టమాటా రేట్లు అయితే కొన్ని ప్రాంతాల్లో సెంచరీ కొట్టేసింది. టమాటా రేంజులో కాకపోయినా.. ఉల్లి కూడా కోయకుండానే కన్నీరు పెట్టిస్తోంది. దీంతో కూరగాయలు కొనలేక.. సగటు జీవి ఇబ్బందులు పడుతున్నాడు. ఈ నేపథ్యంలో సగటు జీవికి ఊరటనిచ్చేలా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కూరగాయల ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో.. రాయితీపై ఉల్లి, టమాటాలు ప్రజలకు విక్రయించాలని …

    Read More »
  • 8 October

    బీఎస్‌ఎన్‌ఎల్‌ నెక్ట్స్‌ లెవల్‌ అంతే.. అందుబాటులోకి మరో కొత్త ఫీచర్‌.. Airtel తర్వాత BSNL మాత్రమే!

    BSNL Selfcare App : జియో, ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ ఐడియాలు రీఛార్జ్ ప్లాన్లు పెండటంతో.. ప్రభుత్వ టెలికాం దిగ్గజం బీఎస్‌ఎన్‌ఎల్‌ (BSNL) ఊపందుకుంది. ఇతర నెట్‌వర్క్‌ వినియోగదారులు బీఎస్‌ఎన్‌ఎల్ వైపు చూస్తున్నారు. ఇప్పటికే లక్షలాది మంది వినియోగదారులు ఇతర కంపెనీల సిమ్‌లను బీఎస్‌ఎన్‌ఎల్‌కు పోర్ట్‌ పెట్టుకుంటున్నారు. ఇదే అదనుగా భావించిన బీఎస్‌ఎన్‌ఎల్‌ చౌకైన ప్లాన్‌లను సైతం అందిస్తోంది. అంతే కాకుండా.. వినియోగదారుల కోసం నిరంతరం కొత్త ప్లాన్‌లను కూడా తీసుకువస్తోంది. బీఎస్‌ఎన్‌ఎల్‌ 4G నెట్‌వర్క్‌పై నిరంతరం పని చేస్తోంది. ఎలాగైనా.. ఈ ఏడాది చివరి …

    Read More »
  • 8 October

    చెరువుల్లో 386 ఎకరాలు మాయం!

    హైదరాబాద్‌ నగరం, చుట్టుపక్కల ప్రాంతాల్లోని చెరువులు, కుంటల్లో అంతులేని ఆక్రమణలు చోటుచేసుకున్నాయి. ప్రత్యేకించి గడిచిన పదేళ్లకాలంలో అత్యధికంగా చెరువులు కబ్జాకు గురయ్యాయి. ఔటర్‌ రింగ్‌ రోడ్డు వరకు మొత్తం 695 చెరువులు ఉన్నట్లు ప్రభుత్వ రికార్డులు చెబుతుండగా.. ఇందులో 2014 నుంచి 2023 మధ్య కాలంలోనే 44 చెరువులు పూర్తిగా కబ్జాలకు గురై కనుమరుగయ్యాయి. మరో 127 చెరువుల్లో పెద్ద మొత్తం విస్తీర్ణం ఆక్రమణల పాలైంది. మొత్తంగా ఆయా చెరువులన్నింట్లో కలిపి గత పదేళ్లలో 386.71 ఎకరాలు ఆక్రమణలకు గురైనట్లు అధికారులు తేల్చారు. వీటిలో …

    Read More »
  • 8 October

    చంద్రబాబు ఢిల్లీ పర్యటన.. రైల్వే జోన్‌కు ముహూర్తం ఫిక్స్.. ఆ రూట్లో 4 లేన్ల ప్రాజెక్టు..!

    సీఎం నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన వేళ.. ఏపీకి కేంద్రం శుభవార్త చెప్పింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు నాయుడు.. సోమవారం రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో భేటీ అయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ ముగిసిన తర్వాత.. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ఈ భేటీలో రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న రైల్వే ప్రాజెక్టు పనులు, రైల్వేజోన్ శంకుస్థాపన విషయమై చర్చించారు. అనంతరం కేంద్ర మంత్రితో జరిగిన చర్చల విషయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ఎక్స్ …

    Read More »
  • 8 October

    పోలవరం నిధులపై ఏపీకి కేంద్రం శుభవార్త.. ఎన్నాకెన్నాళ్లకు.. ఆ బకాయిలు సహా అడ్వాన్సు

    విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సోమవారం తీపి కబురు అందించింది. ప్రాజెక్ట్ కోసం రూ.2,800 కోట్ల నిధులు విడుదల చేసింది. అయితే, ఈ మొత్తాన్ని ఏ పద్దు కింద విడుదల చేసిందో స్పష్టమైన సమాచారం తెలియాల్సి ఉంది. పాత బకాయిల రీయింబర్స్‌మెంట్‌ కింద రూ.800 కోట్లు, పనులు చేపట్టేందుకు అడ్వాన్సుగా రూ.2,000 కోట్లు విడుదల చేసినట్టు ప్రాజెక్టు అధికారులు అంటున్నారు. ఉమ్మడి రాష్ట్రం విభజన సమయంలో 2014లో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన విషయం తెలిసిందే. …

    Read More »
  • 7 October

    ఏపీలో కొత్తగా ఐదు జిల్లాలు ఏర్పాటు.. ఆ రెండు జిల్లాలు రద్దు.. ప్రభుత్వం క్లారిటీ

    ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న 13 జిల్లాలు 26 జిల్లాలుగా పెరిగాయి. ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో మరికొన్ని జిల్లాలను ఏర్పాటు చేయాలనే డిమాండ్ వినిపించింది. ఉమ్మడి కడప, ఉమ్మడి ప్రకాశం, ఉమ్మడి అనంతపురం, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల్లో పలు డిమాండ్లు తెరపైకి వచ్చాయి. ఇటీవల ఎన్నికల సమయంలో కూటమి ఈ డిమాండ్లపై హామీలు ఇచ్చింది. వీటిలో ప్రధానంగా మార్కాపురం …

    Read More »
  • 7 October

    తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. హైడ్రా కూల్చివేతలు నిలుపుదల..?

    గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలు, పార్కులు కబ్జా చేసి నిర్మించిన అక్రమ కట్టడాలను హైడ్రా నేలమట్టం చేస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఇప్పటికే వందల ఇండ్లను నేలమట్టం చేశారు. కొందరు పేదల ఇండ్లతో పాటుగా బడాబాబుల ఖరీదైన విల్లాలను సైతం బుల్డోజర్ల సాయంతో కూల్చేశారు. అయితే ఈ కూల్చివేతలపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల అమీన్‌పూర్, పటేల్‌గూడ ప్రాంతాల్లో కూల్చివేతలు చేపట్టగా.. బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ సందర్భంగా హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం …

    Read More »