జియో భారత్‌ జే1 4G ఫోన్‌ కేవలం రూ.1799 మాత్రమే.. 

Jio Bharat J1 4G Phone : దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో.. దేశీయ మార్కెట్లోకి బడ్జెట్ ఫ్రెండ్లీ ఫీచర్ ఫోన్ జియో భారత్ జే1 4జీ (Jio Bharat J1 4G) ఫోన్ ఆవిష్కరించింది. ఇది 4G కనెక్టివిటీతో దేశీయ మార్కెట్లో ప్రవేశ పెట్టిన ఎంట్రీ లెవల్ ఫీచర్ ఫోన్. జియో స్పెషల్ జియో భారత్ ప్లాన్‌కు మద్దతుగా బడ్జెట్ ఆఫర్ ఫోన్ అందిస్తోంది. ఇందులో జియో టీవీ, జియో సినిమా, జియో పే వంటి యాప్స్ ప్రీ- ఇన్‌స్లాల్‌ చేసింది. రేర్ కెమెరా యూనిట్‌తో మార్కెట్ లో అందుబాటులో ఉంది. గతేడాది అక్టోబర్‌లో జియో విడుదల చేసిన జియో భారత్‌ B2 మరియు B1 ఫీచర్‌ ఫోన్ల కంటే తాజాగా అందుబాటులోకి వచ్చిన Jio Bharat J1 4G ఫోన్‌ పెద్ద డిస్‌ప్లే ను కలిగి ఉండటంతో పాటు తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చింది.

డార్క్ గ్రే కలర్ ఆప్షన్‌లో లిస్టయిన ఈ ఫీచర్ ఫోన్ అమెజాన్ ద్వారా రూ.1,799లకే లభిస్తుంది. జియోభారత్ జే1 4జీ ఫోన్ డెడికేటెడ్ నేవిగేషన్ ప్లస్ ఫిజికల్ కీప్యాడ్‌తోపాటు 2.8 అంగుళాల డిస్ ప్లే ఉంటుంది. ఈ ఫోన్ థ్రెడ్ఎక్స్ ఆర్టీఓఎస్ (Threadx RTOS) వర్షన్ పై పని చేస్తుంది. 0.13 జీబీ ఆన్ బోర్డ్ స్టోరేజీ కెపాసిటీతో వస్తున్న ఈ ఫోన్ లో స్టోరేజీ కెపాసిటీని 128 జీబీ వరకూ పెంచుకోవచ్చు. అలాగే.. నెలవారీగా 14జీబీ డేటా, అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ అందించే రూ.123.. 4జీ రీచార్జి ప్లాన్ అందిస్తుంది. ముందస్తుగా ఇన్ స్టల్ చేసిన జియో టీవీ యాప్ ద్వారా పలు రీజనల్ చానెళ్లతో కలిసి 455+ చానెళ్లు పొందొచ్చు.

యూపీఐ లావాదేవీలు తేలిగ్గా జరిపేందుకు జియో పే యాప్ కూడా వినియోగించుకోవచ్చు. జియో భారత్ జే4 ఫోన్ 2500 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ కలిగి ఉంటుంది. 3.5 ఎంఎం ఆడియో జాక్, రేర్ లో డిజిటల్ కెమెరా యూనిట్, ఆన్ లైన్ పేమెంట్స్ కోసం యూజర్లు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడానికి కెమెరా ఉపకరిస్తుంది. ఈ ఫోన్ లో జియో మనీ ద్వారా UPI పేమెంట్‌ చేసేందుకు అవకాశం ఉండటంతో పాటు జియో సినిమా యాప్‌ ద్వారా OTT సర్వీసులకు కూడా పొందవచ్చు. HD కాలింగ్‌ సపోర్టు ఈ ఫోన్‌ సొంతం. దీంతోపాటు ఇంకా అనేక ప్రత్యేకతలను కలిగి ఉంది.

జియో భారత్‌ జే1 4జీ (Jio Bharat J1 4G) ఫోన్‌ కోసం ప్రత్యేక రీఛార్జ్‌ ప్లాన్‌ను (Jio Bharat J1 4G Phone Recharge Plan) కూడా అందుబాటులో ఉంది. వినియోగదారులు కనీసం రూ.123 తో రీఛార్జ్ చేయించుకోవాల్సి ఉంటుంది. దీని ద్వారా అన్‌లిమిటెడ్‌ కాలింగ్ సహా రోజువారీ 0.5GB డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 28 రోజులు ఉంటుంది.

About rednews

Check Also

TCS Campus in Vizag: విశాఖలో క్యాంపస్ ఏర్పాటు.. ప్లాన్ మార్చిన టీసీఎస్!.. అక్కడేనా?

ఏపీలోని యువతకు శుభవార్త.. విశాఖపట్నంలో టీసీఎస్ క్యాంపస్ ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. టాటా సన్స్ బోర్డు ఛైర్మన్ నటరాజన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *