Gold Loans: చీపెస్ట్ గోల్డ్ లోన్స్.. ఏ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు ఎలా.. ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ సహా దేంట్లో ఎంతంటే?

HDFC Bank Gold Loan: మనకు ఏదో ఒక సమయంలో కాస్త పెద్ద మొత్తంలో డబ్బు అవసరం పడుతుంది. అప్పుడు స్నేహితులు, బంధువుల దగ్గర అందుబాటులో లేకుంటే ఇక బ్యాంక్ లోన్ల కోసం అప్లై చేస్తుంటారు. ఇందులో పర్సనల్ లోన్ వంటి వాటికైతే చాలా డాక్యుమెంట్లు కావాలి. మంచి సిబిల్ స్కోరు ఉండాలి. ఇంకా ఇది అన్ సెక్యుర్డ్ లోన్. వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటాయి. అందుకే దీనికి ప్రత్యామ్నాయంగా సురక్షిత లోన్ అంటే గోల్డ్ లోన్లు అని చెప్పొచ్చు. ఇక్కడ బంగారం తాకట్టుగా పెట్టి లోన్ పొందొచ్చన్నమాట. మీ దగ్గర ఉన్న గోల్డ్ జువెలరీ లేదా ఇతర నగలు, కాయిన్లు వంటివి తనఖా పెట్టి రుణం పొందొచ్చు.

చాలా వేగంగా ఈజీగా పొందగలిగేది గోల్డ్ లోన్లు అని చెప్పొచ్చు. దేశంలోని అన్ని ప్రముఖ బ్యాంకులు కూడా ఈ రుణాలు మంజూరు చేస్తున్నాయి. ఇక్కడ గోల్డ్ ఒక్కటి ఉంటే చాలు. క్రెడిట్ స్కోరుతో కూడా ఎలాంటి పని ఉండదు. చాలా బ్యాంకులు ఈ క్రెడిట్ స్కోరు అడగకుండానే గోల్డ్ లోన్ ఇస్తుంటాయి. ఇక్కడ మీ దగ్గర కేవైసీ డాక్యుమెంట్ ఒక్కటి ఉంటే సరిపోతుంది. ఇంకా ఎలాంటి ఇన్‌కం ప్రూఫ్ కూడా అక్కర్లేదు. ఇక ఏ బ్యాంకుల్లో ఈ గోల్డ్ లోన్లపై వడ్డీ రేట్లు ఎంత ఉన్నాయని తెలుసుకుందాం.

కోటక్ మహీంద్రా బ్యాంకులో ప్రస్తుతం గోల్డ్ లోన్ వడ్డీ రేట్లు 8 శాతం నుంచి ప్రారంభమై గరిష్టంగా 24 శాతం వరకు ఉన్నాయి. ఇక లోన్ మొత్తంలో 2 శాతం వరకు ప్రాసెసింగ్ ఫీజు ప్లస్ జీఎస్టీ ఉంటుంది. దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో 8.30 శాతం నుంచి 16.55 శాతం వరకు ఉన్నాయి. ఇక్కడ మీకు లోన్ మొత్తంలో ఒక శాతం ప్రాసెసింగ్ ఫీజుగా ఉంది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కనిష్టంగా 8.45 శాతం నుంచి 8.55 శాతంగానే ఉన్నాయి. యూకో బ్యాంకులో 8.50 శాతంగా వడ్డీ రేటు ఉంది.

About rednews

Check Also

TCS Campus in Vizag: విశాఖలో క్యాంపస్ ఏర్పాటు.. ప్లాన్ మార్చిన టీసీఎస్!.. అక్కడేనా?

ఏపీలోని యువతకు శుభవార్త.. విశాఖపట్నంలో టీసీఎస్ క్యాంపస్ ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. టాటా సన్స్ బోర్డు ఛైర్మన్ నటరాజన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *