SSC CGL 2024 Tier 1 Exam Date : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవల్ (CGL) టైర్-1 పరీక్ష-2024 తేదీలు విడుదలయ్యాయి. ఈ మేరకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రకటన జారీ చేసింది. తాజా ప్రకటన ప్రకారం.. దేశవ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో సెప్టెంబర్ 9వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ఈ పరీక్షలు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) విధానంలో జరగనున్నాయి. ఇందుకు సంబంధించి త్వరలోనే అడ్మిట్‌కార్డులు విడుదల కానున్నాయి. కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవల్ (CGL) పరీక్ష ద్వారా వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లోని గ్రూప్-బీ, గ్రూప్-సీ విభాగాల్లో మొత్తం 17,727 ఖాళీలను భర్తీ చేయనున్న సంగతి తెలిసిందే. టైర్-1 పరీక్ష అనంతరం టైర్ 2 పరీక్ష, డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్స్ మెజర్‌మెంట్స్, మెడికల్ టెస్టులు, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
SSC CGL 2024 టైర్-1 పరీక్ష విధానం :
కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవల్ టైర్-1 పరీక్షకు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 25 ప్రశ్నలకు 50 మార్కులు, జనరల్ అవేర్‌నెస్ విభాగం నుంచి 25 ప్రశ్నలకు 50 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ విభాగం నుంచి 25 ప్రశ్నలకు 50 మార్కులు, ఇంగ్లిష్ కాంప్రహెన్షన్ విభాగం నుంచి 25 ప్రశ్నలకు 50 మార్కులకు ప్రశ్నాపత్రం ఉంటుంది. ఈ పరీక్ష 1 గంట వ్యవధిలో రాయాల్సి ఉంటుంది.
SSC GD Constable 2024 : భారీగా కానిస్టేబుల్ ఉద్యోగాలు.. ఈనెల 27న నోటిఫికేషన్ విడుదల
కేంద్ర సాయుధ బలగాల్లో కానిస్టేబుల్, రైఫిల్‌మ్యాన్ (GD) నియామకాల భర్తీకి సంబంధించిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈసారి వివిధ విభాగాల్లో భారీ సంఖ్యలో కానిస్టేబుల్ (జీడీ) నియామకాల ప్రక్రియకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) సన్నద్ధమవుతోంది. ఇటీవల విడుదలైన ఎస్‌ఎస్‌సీ 2024-25 వార్షిక క్యాలెండర్ ప్రకారం.. ఆగస్టు 27వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది. వెంటనే ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ చేపట్టి.. అక్టోబర్ 5వ తేదీతో ముగియనుంది. 2024 జనవరి లేదా ఫిబ్రవరిలో రాత పరీక్షలు నిర్వహించనున్నారు. కాగా.. గతేడాది 46,617 ఖాళీల భర్తీకి నియామక ప్రక్రియ చేపట్టిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఏడాది కూడా భారీ సంఖ్యలోనే పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉంది.
ఈ పోస్టులకు 10వ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. పురుష అభ్యర్థుల ఎత్తు 170 సెంటీ మీటర్లు, మహిళా అభ్యర్థుల ఎత్తు 157 సెంటీ మీటర్లకు తగ్గకుండా ఉండాలి. అలాగే అభ్యర్ధుల వయసు 18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్ల వరకు సడలింపు ఉంటుంది. ఎంపికైన అభ్యర్ధులకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు జీతభత్యాలు ఉంటాయి. ఈ నోటిఫికేషన్ కింద బీఎస్‌ఎఫ్, సీఐఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ, ఎస్‌ఎస్‌ఎఫ్‌లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులు, అస్సాం రైఫిల్స్‌లో రైఫిల్‌మ్యాన్ (జనరల్ డ్యూటీ) పోస్టులు, ఎన్‌సీబీలో సిపాయి పోస్టులను భర్తీ చేస్తారు. రాత పరీక్ష, ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.