కుప్పకూలిన 7 స్టాక్స్.. ఏకంగా రూ. 50 లక్షల కోట్ల సంపద ఉఫ్.. అదే దెబ్బతీసింది!

Stocks Crash: ఒక్కసారిగా మళ్లీ మాంద్యం భయాలు విరుచుకుపడ్డాయి. స్టాక్ మార్కెట్లు మరోసారి సోమవారం రోజు అతలాకుతలమయ్యాయి. ఇన్వెస్టర్లకు రక్త కన్నీరే మిగిలింది. దేశీయ, అంతర్జాతీయ సూచీలు అన్నీ కుప్పకూలిపోయాయి. ముందుగా జపాన్‌లో స్టాక్ మార్కెట్ సూచీలు భారీగా నష్టపోగా.. ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధం, చైనా- అమెరికా ట్రేడ్ వార్‌కు తోడు.. ఇటీవలి అమెరికా గణాంకాలు ప్రతికూల ప్రభావం చూపగా.. ఆర్థిక మాంద్యం భయాలు ఎక్కువయ్యాయి. ఇదే క్రమంలో భారత స్టాక్ మార్కెట్లు కూడా సోమవారం రోజు భారీగా పడిపోయాయి. సెన్సెక్స్ ఏకంగా 2 వేల పాయింట్ల మేర నష్టపోయింది. ఇక తర్వాత యూఎస్ స్టాక్ మార్కెట్లు కూడా భారీ మొత్తం నష్టపోయాయి.

అమెరికా సూచీలైన డౌ జోన్స్ 2.58 శాతం నష్టంతో 38,710.39 వద్ద స్థిరపడింది. ఇక నాస్‌డాక్ సూచీ 3.38 శాతం పతనంతో 16,208.38 వద్ద ఉంది. ఎస్ అండ్ పీ 500 ఇండెక్స్ 2.92 శాతం పడిపోయి చివరకు 5190.51 వద్ద సెషన్ ముగించింది. అమెరికా సూచీలు ఇలా పడిపోయిన నేపథ్యంలో ప్రపంచ దిగ్గజ బిలియనీర్లకు చెందిన పలు స్టాక్స్ భారీగా పడిపోయాయి.

2024 మొదటి అర్ధభాగంగా భారీగా పెరిగిన ఈ స్టాక్స్.. ఒక్కరోజులో భారీ పతనంతో ఇన్వెస్టర్లకు తీరని నష్టం మిగిల్చాయి. ఆర్థిక మాంద్యం భయాలతో అమ్మకాల ఒత్తిడి జరగడమే మార్కెట్ పతనానికి కారణం అని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అన్నింటిలోకెల్లా దిగ్గజ కంపెనీలైన అల్ఫాబెట్, అమెజాన్, యాపిల్, మెటా, మైక్రోసాఫ్ట్, ఎన్విడియా, టెస్లా షేర్లు భారీగా నష్టపోయాయి. మోర్గాన్ స్టాన్లీ రిపోర్ట్ ప్రకారం.. సోమవారం రోజు నష్టాలతో ఎస్ అండ్ పీ 500 లోని స్టాక్స్ మార్కెట్ విలువ 600 బిలియన్ డాలర్లకుపైగా భారత కరెన్సీలో రూ. 50 లక్షల కోట్లకుపైగా తగ్గింది.

దిగ్గజ చిప్ మేకర్, ఏఐ ఆధారిత సంస్థ ఎన్విడియా షేరు సోమవారం రోజు 7 శాతం పడిపోయింది. ఈ 7 స్టాక్స్‌లో ఇదే ఎక్కువగా నష్టపోయింది. సంస్థ సీఈఓ జెన్సన్ హ్యుయాంగ్ 7.9 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 66 వేల కోట్లు) నష్టపోయారు. అల్ఫాబెట్ స్టాక్ ధర కూడా 4 శాతానికిపైగా పతనమైంది.

అమెజాన్ షేరు ఒక్కరోజులో 4 శాతానికిపైగా పతనమైంది. అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ సంపద ఒక్కరోజులో రూ. 67 వేల కోట్లకుపైగా తగ్గింది. యాపిల్ స్టాక్ 4.82 శాతం దిగొచ్చింది. మెటా స్టాక్ 2.54 శాతం నష్టపోగా.. మైక్రోసాఫ్ట్ 3 శాతానికిపైగా పడిపోయింది. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా స్టాక్ 4 శాతానికిపైగా తగ్గింది.

About rednews

Check Also

TCS Campus in Vizag: విశాఖలో క్యాంపస్ ఏర్పాటు.. ప్లాన్ మార్చిన టీసీఎస్!.. అక్కడేనా?

ఏపీలోని యువతకు శుభవార్త.. విశాఖపట్నంలో టీసీఎస్ క్యాంపస్ ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. టాటా సన్స్ బోర్డు ఛైర్మన్ నటరాజన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *