Tag Archives: arji college

కోల్‌కతాలో అర్ధరాత్రి అనూహ్య పరిణామం.. వైద్యురాలిపై అత్యాచారం జరిగిన ఆస్పత్రి ధ్వంసం

కోల్‌కతాలో ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో వైద్యురాలి హత్యాచారం ఘటనపై మహిళల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. బుధవారం అర్ధరాత్రి 11.55 గంటలకు ‘దేశానికి స్వాతంత్య్రం వచ్చిన అర్ధరాత్రి మహిళల స్వాతంత్ర్యం’ పేరుతో ఆందోళన చేపట్టారు. ఈ సమయంలో ఆర్జీ కార్ హాస్పిటల్‌పై దాడి చేశారు. ఈ దాడిలో ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డు పూర్తిగా ధ్వంసమైందని పోలీసులు తెలిపారు. ఆందోళనకారులను చెదరగొట్టడానికి లాఠీఛార్జ్ చేసిన పోలీసులు.. టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. నిరసనకారులు రాళ్లు రువ్వడంతో పోలీసులకు గాయాలయ్యాయి. డజన్లుకొద్దీ గుర్తుతెలియని వ్యక్తులు ఆస్పత్రిలోకి చొరబడే …

Read More »