సొంతగడ్డపై పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు ఘోర పరాభవం ఎదురైంది. పసికూన బంగ్లాదేశ్ చేతిలో ఆ జట్టు టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురైంది. పూర్తిస్థాయి జట్టులో బరిలోకి దిగినప్పటికీ.. బంగ్లాదేశ్‌ను కట్టడి చేయలేక చిత్తుగా ఓడిపోయింది. రెండు మ్యాచుల టెస్టు సిరీస్‌ను 0-2తో కోల్పోయింది. వరుసగా రెండు టెస్టుల్లోనూ ఓడి.. ఘోర పరాజయాన్ని మూట గట్టుకుంది. రెండో టెస్టులో పట్టు చిక్కే అవకాశం లభించినప్పటికీ.. 6 వికెట్ల తేడాతో పరాజయం పాలై పరువు పోగొట్టుకుంది. రావల్పిండి వేదికగా జరిగిన రెండో టెస్టు చివరి ఇన్నింగ్స్‌లో 185 …
Read More »Tag Archives: bangladesh
కష్టకాలంలో షేక్ హసీనాకు సాయం.. కేంద్రంపై శశిథరూర్ ప్రశంసలు
కష్ట సమయంలో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు కేంద్ర ప్రభుత్వం సాయం చేయడం పట్ల కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ప్రశంసలు కురిపించారు. ఓ స్నేహితుడిగా ఆమెకు భారత్ సహయం చేయడం అభినందనీయమని వ్యాఖ్యానించారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి..బంగ్లాదేశ్‌ను వీడి భారత్‌లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్‌లో పరిస్థితులపై జాతీయ మీడియాతో తిరువనంతపురం ఎంపీ మాట్లాడుతూ.. పొరుగు దేశంలో అధికార మార్పిడి విషయంలో భారత్ ఎటువంటి ఆందోళన పడాల్సిన అవసరం …
Read More »మా శత్రువుకు సాయం చేస్తే భారత్‌తో సహకారం కష్టమే.. బీఎన్పీ
షేక్ హసీనాకు భారత్ సాయంపై ఆమె ప్రత్యర్ధి పార్టీ బంగ్లాదేశ్ నేషలిస్ట్ పార్టీ (బీఎన్పీ) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ప్రధాని పదవికి రాజీనామా చేసిన హసీనా.. బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు సోమవారం వచ్చిన విషయం తెలిసిందే. ఆమెకు భారత్‌లో తాత్కాలిక ఆశ్రయం కల్పించింది కేంద్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో బీఎన్పీ సీనియర్ నేత, బంగ్లాదేశ్ మాజీ మంత్రి గయేశ్వర్ రాయ్ స్పందించారు. బంగ్లాదేశ్, భారత్ మధ్య పరస్పర సహకారం ఉండాలని బీఎన్పీ బలంగా నమ్ముతుందని ఆయన అన్నారు. ఈ స్ఫూర్తిని అనుసరించే విషయంలో …
Read More »బంగ్లాదేశ్ కొత్త ప్రధానిగా 26 ఏళ్ల నహిద్ ఇస్లామ్.. రేసులో భారత వ్యతిరేకి కూడా!
Nahid Islam: బంగ్లాదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. దశాబ్దాలుగా ఆ దేశాన్ని ఏలిన షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. ఇక ప్రస్తుతం సైనిక పాలనలో ఉన్న బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఈ తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటులో ముగ్గురి పేర్లు బాగా వినిపిస్తున్నాయి. బంగ్లాదేశ్ రిజర్వేషన్ల ఉద్యమానికి నాయకత్వం వహించిన 26 ఏళ్ల నహీద్ ఇస్లామ్ కొత్త ప్రధాని రేసులో ఉన్నారు. నహీద్ ఇస్లామ్‌తోపాటు మాజీ ప్రధానమంత్రి, షేక్ హసీనా రాజకీయ ప్రత్యర్థి ఖలీదా జియా, …
Read More »బంగ్లాదేశ్‌లో హోటల్‌కు నిప్పు.. 24 మంది సజీవదహనం.. 440కి చేరిన మృతులు
బంగ్లాదేశ్‌లో హింసాత్మక సంఘటనలు ఆగడం లేదు. ఇప్పటికే ప్రధానమంత్రి పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి.. దేశం విడిచి పారిపోయినా అక్కడ ఆందోళనలు మాత్రం చల్లారడం లేదు. దేశం మొత్తాన్ని సైన్యం తమ ఆధీనంలోకి తీసుకున్నా.. నిరసనకారులు రెచ్చిపోతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ అల్లర్లలో చనిపోయిన వారి సంఖ్య 440 కి పెరిగింది. తాజాగా ఓ హోటల్‌కు అల్లరిమూకలు నిప్పుపెట్టడంతో.. అందులో ఉన్న 24 మంది సజీవ దహనం అయ్యారు. ఆ హోటల్‌లో ఇండోనేషియాకు చెందిన ఓ పౌరుడు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. …
Read More »