Election Commission: మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల సందర్భంగా కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా ఎగ్జిట్ పోల్స్, ఈవీఎంల ట్యాంపరింగ్‌పై సుదీర్ఘ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు పూర్తిగా తలకిందులు కావడంతోపాటు ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్ష పార్టీలు ఈవీఎంల పనితీరుపై తీవ్ర విమర్శలు గుప్పించగా.. వాటిపైనా సీఈసీ స్పందించారు. ఎగ్జిట్ పోల్స్‌కు ఎలాంటి శాస్త్రీయత లేనప్పటికీ అవి …
Read More »Tag Archives: elections
మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికలు.. నేడే షెడ్యూల్ ప్రకటించనున్న ఈసీ
మహారాష్ట్ర, ఝార్ఖండ్ శాసనసభ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం (EC) మంగళవారం మధ్యాహ్నం విడుదల చేయనుంది. ఇందు కోసం మధ్యాహ్నం 3.30 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నట్టు ఈసీ వెల్లడించింది. ఈ రెండు రాష్ట్రాలతో పాటు రాహుల్ గాంధీ రాజీనామాతో ఖాళీ అయిన వయనాడ్ లోకసభ స్థానం, దేశంలోని పలు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 45 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల తేదీలను ప్రకటించనుంది. వాస్తవానికి హర్యానా, జమ్మూ కశ్మీర్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పుడే మహారాష్ట్ర, ఝార్ఖండ్‌లకు తేదీలను ప్రకటిస్తారని భావించారు. కానీ, …
Read More »రేపే శ్రీలంక అధ్యక్ష ఎన్నికలు.. బరిలో 38మంది, కానీ ఆ ముగ్గురి మధ్యే పోరు
Sri Lanka: 2022లో తీవ్ర ఆర్థిక, ఆహార, రాజకీయ సంక్షోభంతో పతనావస్థకు చేరుకున్న ద్వీపదేశం శ్రీలంకలో పరిస్థితులు క్రమంగా మెరుగవుతున్నాయి. విదేశీ మారక నిల్వలు అయిపోయి.. నిత్యావసరాల ధరలు, పెట్రోల్ డీజిల్ ధరలు ఆకాశాన్నంటడంతో కొన్ని నెలల పాటు శ్రీలంకలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. రాజపక్స కుటుంబాన్ని దేశం నుంచి తరిమేలా చేసిన శ్రీలంకవాసులు.. ఆ తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నారు. రణిల్ విక్రమసింఘే నేతృత్వంలోని శ్రీలంక నెమ్మదిగా ఆ సంక్షోభం నుంచి బయటపడుతోంది. ఇలాంటి సమయంలో ఆ దేశంలో అధ్యక్ష ఎన్నికలు …
Read More »మహిళలకు శుభవార్త.. ప్రతీ నెల అకౌంట్లలోకి రూ.2100, విద్యార్థినులకు స్కూటీలు
హర్యానా అసెంబ్లీ ఎన్నికల వేళ.. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ హోరాహోరీగా ప్రచారాలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 7 గ్యారెంటీల పేరుతో ఎన్నికల మేనిఫేస్టోను విడుదల చేయగా.. తాజాగా బీజేపీ కూడా తమ మేనిఫెస్టోను ప్రకటించింది. హర్యానా వాసులకు కాంగ్రెస్ 7 గ్యారెంటీలు ఇవ్వగా.. బీజేపీ 20 హామీల వర్షం కురిపించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్రమంత్రి జేపీ నడ్డా.. సంకల్ప్ పత్ర పేరుతో 20 పాయింట్ల వాగ్దానాలను ప్రకటించారు. గత ఎన్నికల్లో తాము ఇచ్చిన హామీలను పూర్తిగా …
Read More »జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి పదేళ్ల తర్వాత ఎన్నికలు.. మొదలై తొలి విడత పోలింగ్
జమ్మూ కశ్మీర్‌లో అసెంబ్లీకి పదేళ్ల తర్వాత ఎన్నికలు జరుగుతున్నాయి. చివరిసారిగా 2014లో అక్కడ శాసనసభ ఎన్నికలు జరిగాయి. మొత్తం 90 స్థానాలుండగా.. మూడు దశల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో తొలి విడతలో 24 నియోజకవర్గాల్లో బుధవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది. మొదటి విడతలో వివిధ పార్టీలకు చెందిన 219 మంది అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 23 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అత్యంత సమస్యాత్మక ప్రాంతం కావడంతో భద్రతా …
Read More »రాజకీయాల్లోకి వినేశ్ ఫొగాట్.. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో సోదరిపైనే పోటీ?
వినేశ్ ఫొగాట్. గత కొన్నిరోజులుగా దేశవ్యాప్తంగా మారుమోగుతున్న పేరు. పారిస్ ఒలింపిక్స్ 2024 లో మహిళల రెజ్లింగ్ విభాగంలో 100 గ్రాములు అధికంగా బరువు ఉన్న కారణంగా పతకానికి దూరమైన వినేశ్ ఫొగాట్ పట్ల దేశం మొత్తం తీవ్ర దిగ్భ్రాంతి చెందింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొదలుకుని.. నెటిజన్ల వరకు అంతా వినేశ్ ఫొగాట్‌కు అండగా నిలిచారు. ఈ క్రమంలోనే 100 గ్రాములు ఎక్కువ బరువు ఉండడంతో చేతివరకు వచ్చిన పతకం చేజారిపోయింది. దీంతో సంచలన నిర్ణయం తీసుకున్న వినేశ్ ఫొగాట్.. రెజ్లింగ్ నుంచి …
Read More »పదేళ్ల తర్వాత జమ్మూ కశ్మీర్‌లో ఎన్నికలు.. మూడు దశల్లో పోలింగ్
రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) సోమవారం మధ్యాహ్నం షెడ్యూల్ విడుదల చేసింది. ప్రధాని ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ మీడియా సమావేశాన్ని ఏర్పాటుచేసి.. జమ్మూ కశ్మీర్, హరియాణా అసెంబ్లీల ఎన్నికల తేదీలను ప్రకటించారు. జమ్మూ కశ్మీర్‌లో 87 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. మూడు దశల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. తొలి విడత పోలింగ్ సెప్టెంబరు 18న రెండో విడత సెప్టెంబరు 25న, మూడో విడత అక్టోబరు 1న నిర్వహించనున్నారు. అక్టోబరు 4న ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు. జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ …
Read More »జమ్మూ కశ్మీర్ సహా నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నేడే షెడ్యూల్
మహారాష్ట్ర సహా నాలుగు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్ శుక్రవారం మధ్యాహ్నం షెడ్యూల్ విడుదల చేయనుంది. ఈ మేరకు మధ్యాహ్నం 3 గంటలకు మీడియాను సమావేశానికి ఆహ్వానించింది. మహారాష్ట్ర, హరియాణా, ఝార్ఖండ్‌తో పాటు జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలను నిర్వహించనున్నారు. సెప్టెంబరు 30లోగా జమ్మూ కశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు గడువు విధించింది. ఈ నేపథ్యంలో మిగతా మూడు రాష్ట్రాలతో పాటు కశ్మీర్‌లోనూ ఎన్నికలకు ఈసీ కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ఇక, హరియాణా అసెంబ్లీకి నవంబరు 3తోనూ.. మహారాష్ట్ర అసెంబ్లీకి నవంబరు …
Read More »ఏపీలో మరోసారి ఎన్నికలు.. ఆగస్టు 30న పోలింగ్, మూడు జిల్లాల్లో కోడ్ అమల్లోకి
ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ వచ్చేసింది. విశాఖపట్నం జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఉపఎన్నిక నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా వైఎస్సార్‌సీపీ తరఫున వంశీకృష్ణ శ్రీనివాస్ గెలిచారు. అయితే ఆయన జనసేన పార్టీలో చేరగా.. అనంతరం అనర్హత వేటు వేయడంతో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయ్యింది. ఆ ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు షెడ్యూల్ వచ్చిందని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. ఆగస్టు 6న ఉపఎన్నిక నోటిఫికేషన్ విడుదలవుతుంది.. …
Read More »