వర్షాకాలం నేపథ్యంలో.. తెలంగాణలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. ప్రధానంగా చిన్నారులు సీజన్ వ్యాధుల బారిన పడుతున్నారు. దీంతో.. చిన్నారులతో ఆస్పత్రులు నిండిపోయాయి. ఏ ఆస్పత్రి చూసినా.. చిన్నపిల్లలతో వార్డులన్ని నిండిపోయాయి. ఈ క్రమంలోనే.. హైదరాబాద్‌లోని ప్రభుత్వ ఆస్పత్రి అయిన నీలోఫర్ హాస్పిటల్‌లోని.. ఎమర్జెన్సీ వార్డులో బెడ్లు లేక పిల్లల తల్లిదండ్రుల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓకే బెడ్డుపై ముగ్గురు నలుగురు పిల్లలను వైద్యులు పడుకోబెట్టి వైద్యం చేస్తున్న పరిస్థితి ఏర్పడింది. దీంతో.. ఒకరి జబ్బు ఇంకొకరికి వచ్చే ప్రమాదం ఉందని తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం …
Read More »