గత కొన్ని నెలలుగా జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు పెరుగుతుండటం దేశం మొత్తం తీవ్ర ఆందోళనకరంగా మారాయి. సరిహద్దుల నుంచి దేశంలోని ఉగ్రవాదులు చొరబడటం, ఇక్కడ ఉన్న ఉగ్రవాద మద్దతుదారులు రెచ్చిపోతున్న ఘటనలు పెరుగుతున్నాయి. త్వరలోనే జమ్మూ కాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో ఉగ్రవాద దాడులు రోజురోజుకూ పెరుగుతుండటం సంచలనంగా మారుతోంది. తాజాగా జరిగిన ఉగ్రవాద కాల్పుల్లో ఇద్దరు భారత సైనికులు గాయాల పాలయ్యారు. జమ్మూ కాశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో శనివారం భద్రతా సిబ్బంది, ఉగ్రవాదులకు మధ్య …
Read More »