ఏపీలో కొత్త మద్యం షాపుల్లో అమ్మకాలు కొనసాగుతున్నాయి. బుధవారం, గురువారం అమ్మకాలు ఊపందుకున్నాయి.. అన్ని బ్రాండ్ మద్యం అందుబాటులోకి రావడంతో మందుబాబులు పండగ చేసుకుంటున్నారు. కొత్త మద్యం పాలసీ రావడంతో బార్ల నిర్వాహకులు దెబ్బకు దిగొచ్చారు.. మద్యం ధరలు తగ్గించారు. మొన్నటి వరకు బార్లలో రెండింతలకు మద్యాన్ని రెండింతల ధరలకు విక్రయించేవారనే విమర్శలు ఉన్నాయి. బుధవారం నుంచి కొత్త మద్యం పాలసీ అమల్లోకి రావడంతో.. మద్యం షాపుల్లో నాణ్యమైన బ్రాండ్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో బార్ల దగ్గర ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఆసక్తికరంగా మారాయి. …
Read More »