Tag Archives: mlc

వైసీపీకి మరో బిగ్ షాక్.. పార్టీకి, పదవికి ఎమ్మెల్సీ సునీత రాజీనామా

అధికారం కోల్పోయిన తర్వాత ఏపీలో వైసీపీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. సీనియర్ నేతల దగ్గర నుంచి జూనియర్ల వరకు అంతా పార్టీకి రాజీనామాలు చేస్తున్నారు. కీలక నేతలు అంతా పార్టీకి, పదవులకు గుడ్ బై చెప్పి.. అధికార తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఎంపీ మోపిదేవి వెంకటరమణ వైసీపీకి రాజీనామా చేసి త్వరలోనే టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా మరో నాయకురాలు పార్టీకి గుడ్ బై చెప్పారు. ఎమ్మెల్సీ పోతుల సునీత.. వైసీపీకి, తన ఎమ్మెల్సీ పదవికి …

Read More »

వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స నామినేషన్.. 3 నెలల్లో ఆస్తులు పెరిగాయి

విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు. సోమవారం మధ్యాహ్నం మధ్యాహ్నం 1.45 గంటలకు 3 సెట్ల పత్రాలను పార్టీ నేతలతో కలిసి రిటర్నింగ్‌ అధికారి కె మయూర్‌ అశోక్‌కు అందజేశారు. నామినేషన్ సమయంలో ఉత్తరాంధ్ర వైఎస్సార్‌సీపీ పరిశీలకుడు వైవీ సుబ్బారెడ్డి కలెక్టరేట్‌ లోపలికి వెళ్లకుండా బయటే ఉన్నారు. బొత్స సత్యనారాయణ వెంట మాజీ మంత్రులు బూడి ముత్యాలనాయుడు, గుడివాడ అమర్‌నాథ్, కురసాల కన్నబాబు, అరకు ఎంపీ తనూజారాణి, విశాఖ మేయర్‌ గొలగాని హరి వెంకటకుమారి, …

Read More »

మాధురిని పరిచయం చేసింది నా భార్యే.. ఏం తప్పుచేశానని నాకీ శిక్ష?.. దువ్వాడ

కుటుంబ వివాదంపై వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ స్పందించారు. విలేకర్ల సమావేశం నిర్వహించిన దువ్వాడ శ్రీనివాస్.. కీలక వ్యాఖ్యలు చేశారు. తన భార్య వాణి అహంకారంతో వ్యవహరిస్తూ.. తనపై కూతుర్లకు ద్వేషం నూరిపోశారని ఆరోపించారు. ప్రతి ఇంట్లోనూ గొడవలు సహజమేనన్న దువ్వాడ శ్రీను.. వాటిని నాలుగు గోడల మధ్యనే పరిష్కరించుకోవాలన్నారు. వ్యాపారంతో పాటుగా రాజకీయాల్లో కూడా తానే ఉండాలని వాణి అహంకారంతో వ్యవహరించిందని.. కుమార్తెలకు తనపై ద్వేషం నింపిందన్నారు. వైఎస్ జగన్ తనకు టెక్కలి టికెట్ ప్రకటిస్తే.. తనకు కావాలని వాణి పట్టుబట్టిందన్నారు. విడాకులు …

Read More »

గన్ లైసెన్స్ కోసం వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ దరఖాస్తు.. కూటమి ప్రభుత్వానికి మరో రిక్వెస్ట్

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఎపిసోడ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది. శ్రీనివాస్ కుటంబంలో వివాదాలు రోడ్డెక్కాయి.. ఆయన ఇద్దరు కూతుళ్లు టెక్కలిలో ఇంటి ఎదురుగా నిరసనకు దిగడం చర్చనీయాంశమైంది. అయితే దువ్వాడకు సంబంధించి మరో ఆసక్తికర విషయం తెలిసింది.. శ్రీనివాస్ గన్ లైసెన్స్‌కు దరఖాస్తు చేశారు. తన దగ్గర గన్ ఉందని.. దానికి లైసెన్స్ ఇవ్వాలని ఈ నెల 7న జిల్లా పోలీసుల్ని కలిసి దరఖాస్తు అందజేశారు. కొద్దిరోజులుగా తనకు కొంత మంది వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని.. కొందరు …

Read More »

వైసీపీ ఎమ్మెల్సీ ఇంటి ముందు కూతుళ్ల నిరసన.. మరో మహిళతో సహజీవనంపై నిరసన!

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటంబ వివాదం రోడ్డెక్కింది. శ్రీకాకుళం జిల్లా టెక్కలి అక్కవరం సమీపంలోని నేషనల్ హైవే పక్కన ఆయన ఇల్లు ఉంది. ఇద్దరు కుమార్తెలు హైందవి, నవీనలు ఆయనను కలిసేందుకు వచ్చారు. వారిద్దరు గురువారం మధ్యాహ్నం 3 గంటలకు అక్కడికి వచ్చారు.. రాత్రి 8 గంటల వరకు అక్కడే నిరీక్షించినా ఇంటి గేట్లు తెరుచుకోలేదు. ఇద్దరు కూతుళ్లు కాసేపు గేటు గడియలు కొట్టినా, కారు హారన్‌ మోగించినా లోపలున్నవారు స్పందించలేదు. ఇంట్లో లైట్లన్నీ ఆర్పేశారని.. లోపల వాహనాలు ఉన్నాయని ఇద్దరు కుమార్తెలు …

Read More »