ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పెట్టుబడిదారులకు ఎదురయ్యే ఇబ్బందులపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ మేరకు ప్రభుత్వంతో నేరుగా చర్చించేందుకు సీఐఐ భాగస్వామ్యంతో కన్సల్టేటివ్ ఫోరం (సంప్రదింపుల కమిటీ)ని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల విజయవాడలో సీఐఐ (భారత పరిశ్రమల సమాఖ్య) నిర్వహించిన సదరన్ రీజినల్ కౌన్సిల్ సదస్సులో ఐటీ మంత్రి నారా లోకేష్ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో కన్సల్టేటివ్ ఫోరాన్ని ఏర్పాటు చేయాలని సీఐఐ ప్రతినిధులు మంత్రిని కోరారు. ఈ మేరకు ఈ అంశంపై …
Read More »Tag Archives: nara lokesh
తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ దర్యాప్తు!.. నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు
తిరుపతి లడ్డూ వివాదం ఏపీ రాజకీయాల్లో కాకరేపుతోంది. తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు వాడారంటూ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన సంచలన ప్రకటనతో.. ఏపీలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. చంద్రబాబు ఆరోపణలకు మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. శుక్రవారం దీనిపై స్పందించిన వైఎస్ జగన్.. తిరుమల లడ్డూతో రాజకీయం చేస్తున్నారంటూ చంద్రబాబుపై మండిపడ్డారు. నెయ్యి నాణ్యత నిర్ధారణ విధానాలను తామేమీ మార్చలేదన్న వైఎస్ జగన్.. ఇదంతా కట్టుకథ అంటూ, డైవర్షన్ పాలిటిక్స్ అంటూ ఆరోపించారు. అయితే …
Read More »ఏపీ మంత్రులకు ఎస్కార్ట్ వాహనాలు రద్దు.. కారణం తెలిస్తే హ్యాట్సాఫ్ అంటారు, లోకేష్ ఐడియా అదుర్స్
ఆంధ్రప్రదేశ్‌లో, ముఖ్యంగా విజయవాడలో వరద విలయం కొనసాగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేయింబవళ్లు వరద సహాయక కార్యక్రమాలను దగ్గరుండి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. మంత్రులు, అధికారుల పర్యటన, వరద సహాయక చర్యలను మంత్రి లోకేష్ పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్రంలో ఏ మూల, ప్రజలకు ఇబ్బంది ఉన్నా వెంటనే స్పందించి అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రితో మంత్రులు సమావేశమయ్యారు. వరద సహాయకచర్యలు, బాధితులకు భోజనం అందించడం వంటి అంశాలపై చర్చించారు. ఈ మేరకు ముఖ్యమంత్రితో జరిగిన సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. మంత్రులు ఎస్కార్ట్ వాహనాలు …
Read More »ఏపీలోకి ఫాక్స్‌కాన్!.. నారా లోకేష్‌తో సంస్థ ప్రతినిధుల చర్చలు
ఏపీ వాసులకు గుడ్ న్యూస్.. ఆంధ్రప్రదేశ్‌కు మరో భారీ ప్రాజెక్టు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఫాక్స్‌కాన్ సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఏపీ మంత్రి నారా లోకేష్‌తో ఫాక్స్‌కాన్ సంస్థ ప్రతినిధులు సోమవారం భేటీ అయ్యారు. ఉండవల్లిలోని మంత్రి నారా లోకేష్ నివాసంలో.. ఆయనను కలిసి పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించారు. భేటీ సందర్భంగా ఏపీలో ఫాక్స్‌కాన్ ప్లాంట్ ఏర్పాటుకు సంస్థ ప్రతినిధులు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఏపీలో పెట్టుబడులు పెట్టి ఉద్యోగాలు కల్పించేందుకు ఫాక్స్‌కాన్ ప్రతినిధులు సూత్రప్రాయంగా …
Read More »కర్నూలు వ్యక్తికి సారీ చెప్పిన లోకేష్.. అసలేమైందంటే?
Nara Lokesh sorry to complainant:ఏపీ మంత్రి నారా లోకేష్ ఓ వ్యక్తికి క్షమాపణలు చెప్పారు. తన తరుఫున, తన విభాగం తరుఫున అతనికి క్షమాపణలు చెప్పారు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా ప్రకటించారు. అసలు సంగతిలోకి వస్తే టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా సమస్యల పరిష్కారానికి లోకేష్ పెద్ద పీట వేస్తున్నారు. ప్రజాదర్బార్ నిర్వహిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. సత్వర పరిష్కారం కోసం కృషిచేస్తున్నారు. అయితే మంగళగిరి నియోజకవర్గం ప్రజలకు ప్రజాదర్బార్ ద్వారా అందుబాటులో ఉంటున్న నారా లోకేష్.. …
Read More »అన్ని సేవలూ ఒకే యాప్‌లో.. చంద్రబాబు సరికొత్త ఆలోచన..
పాలనలో తన మార్కు చూపిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పౌరులకు అందించే సేవలను అన్నింటిని కలిపి ఒక యాప్ రూపంలో తీసుకువచ్చేందుకు ఆలోచనలు చేస్తున్నారు. ఈ మేరకు ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ శాఖపై నిర్వహించిన సమీక్షలో అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. పౌరులకు అవసరమైన వివిధ రకాల సేవలను అందించేందుకు యాప్ రూపకల్పన చేయాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. ఇప్పటికే టాటా సంస్థ ఈ విషయంలో ప్రత్యేక యాప్ రూపొందించిన విషయాన్ని గుర్తుచేసిన చంద్రబాబు.. ఈ యాప్ కొంతవరకూ మెరుగైన …
Read More »మంత్రి నారా లోకేష్ పేరుతో డబ్బుల కావాలని మెసేజ్.. పోలీసులకు టీడీపీ నేతల ఫిర్యాదు
ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఫోటోతో గుర్తు తెలియని వ్యక్తులు మోసం చేసే ప్రయత్నం చేశారు. కొందరు వ్యక్తులు లోకేష్ ఫోటోను వాట్సాప్ ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకుని డబ్బులు అడుగుతున్నారని టీడీపీ నేత బెజవాడ నజీర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం బయటపడింది. ఓ మొబైల్ వాట్సాప్‌కు మంత్రి నారా లోకేష్ ప్రొఫైల్ పిక్‌గా ఉంది.. శుక్రవారం విజయవాడలోని పటమటకు చెందిన ఆర్.వేణుకు ఆ వాట్సాప్ నుంచి ఓ మెసేజ్ వచ్చింది. వాట్సాప్‌కు వచ్చిన మెసేజ్‌లో తనను నారా …
Read More »మంత్రి నారా లోకేష్ ఓఎస్డీగా యువ అధికారి.. ఏరి కోరి మరీ, ఎవరీ ఆకుల వెంకటరమణ!
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ఓఎస్డీగా యువ అధికారి ఆకుల వెంకటరమణ నియమితులయ్యారు. కడప జిల్లా నుంచి ఏరికోరి ఆయన్ను తీసుకొచ్చి మానవ వనరులశాఖలో మంత్రి నారా లోకేష్ ఓఎస్డీగా నియమించారు. రమణ గతంలో తూర్పు గోదావరి జిల్లా చింతూరు ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్‌గా పనిచేశారు. అక్కడ గిరిజనులకు ప్రభుత్వ పథకాలను అందించడంలో, జీవన ప్రమాణాలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషించారు. అక్కడ నుంచి కడప జిల్లా బద్వేలు ఆర్డీవోగా బదిలీ కాగా.. అక్కడ కూడా సమర్థవంతమైన అధికారిగా ప్రశంసలు పొందారు. ఇప్పుడు నారా …
Read More »మంగళగిరి ప్రజల కోసం లోకేష్ ‘ప్రజాదర్బార్’
మంగళగిరి ప్రజల కోసం మంత్రి నారా లోకేష్ ‘ప్రజాదర్బార్’ నిర్వహించనున్నారు. తొలి అడుగులోనే యువనేత సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉండవల్లి నివాసంలో ప్రజలను లోకేష్ కలుసుకున్నారు. గత అయిదేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్నా సేవా కార్యక్రమాలతో మంగళగిరి ప్రజల మనసును నారా లోకేష్ గెలిచారు. అమరావతి: మంగళగిరి ప్రజల కోసం మంత్రి నారా లోకేష్ ‘ప్రజాదర్బార్’ నిర్వహించనున్నారు. తొలి అడుగులోనే యువనేత సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉండవల్లి నివాసంలో ప్రజలను లోకేష్ కలుసుకున్నారు. గత అయిదేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్నా సేవా కార్యక్రమాలతో మంగళగిరి ప్రజల మనసును నారా …
Read More »