బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ నటించిన రీసెంట్ చిత్రం ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ ఓటీటీలోకి అడుగుపెట్టింది. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో రాజ్‌కుమార్ రావ్‌కి జోడీగా నటించింది జాన్వీ కపూర్. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది. అయితే హిందీలో మాత్రమే ఈ చిత్రం అందుబాటులోకి వచ్చింది. తెలుగు సహా ఇతర డబ్బింగ్ వెర్షన్ల గురించి నెట్‌ఫ్లిక్స్ ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. థియేటర్లో రూ.50 కోట్లకి పైగా వసూళ్లు సాధించి ఈ చిత్రం ఫర్వాలేదనిపించింది.
Read More »