Tag Archives: telagana

హైదరాబాద్‌లో భారీగా కుంగిన రోడ్డు.. పెద్ద ప్రమాదమే తప్పింది.. 200 మీటర్ల దూరంలోనే..!

హైదరాబాద్‌లోని గోషామహల్‌లో రోడ్డు భారీగా కుంగిపోయింది. మంగళవారం (అక్టోబర్ 22న) రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 2 గంటల సమయంలో ఒక్కసారిగా రోడ్డు కుంగిపోయింది. గోషామహల్‌లో దారుసలామ్ నుంచి చాక్నావాడికి వెళ్లే మార్గంలో ప్లైవుడ్ దుకాణాల ముందు రోడ్డు భారీగా కుంగిపోయింది. రోడ్డు మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో కుప్పకూలిపోయింది. అయితే.. అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఈ ఘటన జరుగుతుండటంతో.. అక్కడ ప్రజలు ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. సీవరేజ్ పెద్ద నాలా అతిపూరాతనమైనదని స్థానికులు చెప్తున్నారు. అయితే.. ప్రస్తుతం …

Read More »

నేను కూడా పంపిస్తా.. కాచుకో.. కేటీఆర్ నోటీసులపై బండి సంజయ్ స్పందన

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పంపించిన నోటీసులపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. కేటీఆర్ తనకు లీగల్ నోటీసు పంపినట్లు మీడియాలో చూశానని తెలిపిన బండి సంజయ్.. లీగల్ నోటీసుతో భయపెట్టాలని చూస్తే ఇక్కడ భయపడే వారు ఎవరూ లేరని చెప్పుకొచ్చారు. తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదన్నారు తనను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేక లీగల్ నోటీస్ ఇవ్వడం చూస్తుంటే జాలేస్తోందన్నారు. తనపై మొదట కేటీఆరే వ్యక్తిగత ఆరోపణలు చేసి అవమానించినట్టు పేర్కొన్నారు సంజయ్. అందుకు బదులుగానే తాను మాట్లాడినట్టు తెలిపారు. “కేటీఆర్ సుద్దపూస అనుకుంటున్నాడేమో. ఆయన భాగోతం ప్రజలకు …

Read More »