Tag Archives: tirumala

తిరుమల శ్రీవారి ఆలయ సిబ్బందికి టీడీపీ ఎంపీ, మహిళా ఎమ్మెల్యే బహుమానం

తిరుమల శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాల్లో సేవ‌లందిస్తున్న శ్రీవారి ఆలయ అర్చకులు, వేదపారాయణదారులు, ఇతర సిబ్బంది, పోటు సిబ్బంది, వాహ‌నం బేర‌ర్లు, మేళం సిబ్బందికి నెల్లూరు టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్ర‌శాంతి రెడ్డి కలిసి వస్త్ర బహుమానం అందజేశారు. తిరుమల వైభవోత్సవ మండపంలో టీటీడీ ఈవో జే శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, సీవీఎస్వో శ్రీ శ్రీధర్ చేతులమీదుగా వస్త్రాలను అందించారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు ప్రతి సంవత్సరం తిరుమల బ్రహ్మోత్సవాల్లో సిబ్బందికి వస్త్ర బహుమానం అందిస్తున్నట్టు చెప్పారు. …

Read More »

తిరుమల శ్రీవారి భక్తులకు తీపికబురు.. వాట్సాప్ ద్వారా దర్శనం టికెట్లు, పూర్తి వివరాలివే

తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ మరో శుభవార్త చెప్పింది. శ్రీవారి దర్శనం టికెట్లు బుక్ చేసుకునేందుకు సులభమైన విధానాన్ని తీసుకురావాలని నిర్ణయానికి వచ్చారు. ఆ దిశగా టీటీడీ అడుగులు వేస్తోంది.. శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగియగానే పాలకమండలిని నియమించే ఆలోచనలో ఉంది. ఆ తర్వాత.. వచ్చే మూడు నెలల్లో వాట్సాప్ ద్వారా తేలిగ్గా దర్శనం బుక్ చేసుకునే విధానాన్ని తీసుకురాబోతున్నట్లు సమాచారం. ముందుగా తిరుమల శ్రీవారి ఆలయం నుంచి వాట్సాప్ ద్వారా దర్శనం బుకింగ్ సేవలు ప్రారంభించి.. ఆ తర్వాత మెల్లిగా అన్ని దేవాలయాల్లోనూ అందుబాటులోకి …

Read More »

పెళ్లి చేసుకుని తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన జంటకు ట్విస్ట్.. పోలీసుల అదుపులో,

ఓ జంట పెళ్లి చేసుకుని తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. ఇంతలో పోలీసులు సడన్ ఎంట్రీ ఇచ్చారు.. ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. ఏం జరిగిందని ఆరా తీస్తే.. అప్పుడు అసలు సంగతి తెలిసింది. విజయవాడకు చెందిన సాంబశివరావు అలియాస్ శివ, అలేఖ్య ప్రేమించుకుంటున్నారు.. రెండు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు. విజయవాడలోని భవానీపురం పోలీసు స్టేషన్‌లో అలేఖ్య కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. కొత్త జంట తిరుమల శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వస్తున్న విషయాన్ని గుర్తించిన భవానీపురం పోలీసులు తిరుచానూరు …

Read More »

తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. ఒక్కరోజులోనే, సరికొత్త రికార్డు

తిరుమల శ్రీవారి హుండీకి చాలా రోజుల తర్వాత కాసుల వర్షం కురిసింది. కొన్ని నెలల తర్వాత భారీగా ఆదాయం సమకూరింది.. చాన్నాళ్లకు స్వామివారి హుండీ ఆదాయం ఒక్క రోజులో రూ.5కోట్ల మార్కును దాటేసింది. బుధవారం తిరుమల శ్రీవారిని 72,967మంది భక్తులు దర్శించుకున్నారు.. 32,421మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీకి బుధవారం ఒక్కరోజే 5.26 కోట్లు ఆదాయం సమకూరింది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం 26 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఎస్ఎస్డీ టికెట్లు లేని భక్తులకు సర్వ దర్శనానికి 10 …

Read More »

తిరుమల శ్రీవారికి హైదరాబాద్ భక్తుడి భారీ విరాళం.. పెద్ద మనసుతో, ఎంతంటే!

తిరుమల శ్రీవారికి భక్తుల నుంచి విరాళాలు అందుతున్నాయి.. తాజాగా మరొకరు స్వామివారికి భారీ విరాళాన్ని అందజేశారు. హైదరాబాద్‌లోని పునర్జన్ ఆయుర్వేద ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన బొమ్ము వెంకటేశ్వర రెడ్డి సోమవారం సాయంత్రం టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్‌కు రూ.51,09,116/- విరాళంగా అందజేశారు. తిరుమలలోని క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి ఆ మేరకు దాత విరాళం చెక్కును అందించారు. అంతేకాదు కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ రూ.4.10 లక్షల విలువైన ఎరువులను టీటీడీ ఉద్యానవన విభాగానికి విరాళంగా అందజేశారు. ఈ ఎరువులను తిరుమల, …

Read More »

మా నాన్న ఐఏఎస్.. టికెట్లు అమ్ముకునేంత దౌర్భాగ్యం నాకు పట్టలేదు

తిరుమల సిఫార్సు లేఖల విషయంలో గుంటూరు అరండల్‌పేటలో తనపై నమోదైన కేసు, వస్తున్న ఆరోపణలపై వైసీపీ ఎమ్మెల్సీ భరత్ స్పందించారు. తిరుమల శ్రీవారి దర్శనం, పూజ టికెట్లను అమ్ముకునేంత దౌర్భాగ్యం తనకు పట్టలేదని భరత్ అన్నారు.. తన తండ్రి ఓ ఐఏఎస్ అధికారి అని చెప్పిన భరత్ .. తాను ఒక బ్యూరోక్రట్ ఫ్యామిలీ నుంచి వచ్చానని అన్నారు. ఉన్నతమైన విలువలతో తమ కుటుంబం బతుకుతోందని అన్నారు. టీడీపీ నేత చిట్టిబాబు చెప్తున్నట్లుగా తనకు మల్లికార్జున్ అనే పీఆర్వో లేడన్న ఎమ్మెల్సీ భరత్.. ఆ …

Read More »