Train Force One: రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై రెండేళ్లు దాటిపోయింది. అయితే సుదీర్ఘంగా సాగుతున్న ఈ యుద్ధంలో ఇప్పటివరకు ఏ దేశమూ పై చేయి సాధించలేదు. అలాగని ఏ దేశమూ వెనక్కి తగ్గడం లేదు. దీంతో ఎటూ సాగకుండా ఆ యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇక ప్రపంచ దేశాలు చేస్తున్న ప్రయత్నాలు సైతం ఎలాంటి ప్రభావం చూపడం లేదు. ఈ క్రమంలోనే యుద్ధం ప్రారంభమైన తర్వాత తొలిసారి భారత ప్రధాని నరేంద్ర మోదీ.. ఉక్రెయిన్‌లో పర్యటించనున్నారు. యుద్ధం విరమించాలని ఇప్పటివరకు పలుమార్లు ఇరు …
Read More »Tag Archives: ukrain
యుద్ధంలో పుతిన్‌కు షాక్.. 1000 చ.కి.మీ రష్యా భూభాగాన్ని ఆక్రమించుకున్న ఉక్రెయిన్
రెండున్నరేళ్లుగా సాగుతోన్న ఉక్రెయిన్, రష్యా యుద్ధం ఊహించని మలుపు తిరిగింది. యుద్ధం మొదలైన తర్వాత తొలిసారిగా రష్యా భూభాగంలోకి ఉక్రెయిన్ దళాలు చొచ్చుకెళ్లారు. వారం రోజుల కిందట కుర్స్క్ రీజియన్‌లోకి ప్రవేశించిన కీవ్ సేనల దూకుడు ముందు మాస్కో సైన్యాలు తలవంచుతున్నాయి. రష్యా భూభాగాలను ఉక్రెయిన్ సైనికులు తమ నియంత్రణలోకి తీసుకున్నట్లు సమాచారం. కస్క్ రీజియన్‌లో దాదాపు 1000 చదరపు కిలోమీటర్ల మేర భూభాగం స్వాధీనం చేసుకున్నట్టు ఉక్రెయిన్ సైనిక కమాండర్ జనరల్ ఒలెక్సాండర్ సిర్స్కీ ప్రకటించారు. అటు, రష్యాలోకి తమ సేనలు ప్రవేశించిన …
Read More »మంటల్లో జపోరిజియా అణువిద్యుత్ ప్లాంట్.. అంతర్జాతీయ సమాజం ఆందోళన
ఐరోపాలో అతిపెద్ద అణువిద్యుత్తు కర్మాగారంలో మంటలు చెలరేగడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఉక్రెయిన్‌కు చెందిన జపోరిజియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ప్రస్తుతం రష్యా నియంత్రణలో ఉంది. దీనిపై రష్యా, ఉక్రెయిన్లు ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. రష్యా సైన్యమే ఈ పేలుళ్లకు పాల్పడినట్టు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్స్కీ ఆరోపించారు. కీవ్‌ను బ్లాక్ మెయిల్ చేయడానికి ఈ చర్యకు తెగబడ్డారని ఆయన మండిపడ్డారు. అటు, ఉక్రెయిన్ దళాలు ప్రయోగించిన శతఘ్నుల వల్లే మంటలు వ్యాపించాయని మాస్కో ప్రత్యారోపణలు చేసింది. ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో ఈ …
Read More »