బాలయ్య అన్‌స్టాపబుల్-4లో చంద్రబాబు.. స్ట్రీమింగ్ ఎప్పుడో క్లారిటీ వచ్చేసింది!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి అన్‌స్టాపబుల్‌ షోలో సందడి చేశారు. ఆహా ఓటీటీలో సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా అన్‌స్టాపబుల్ సీజన్-4 టాక్ షో త్వరలో ప్రారంభంకానుంది. అయితే తొలి ఎపిసోడ్‌కు సీఎం చంద్రబాబు నాయుడు సందడి చేయనున్నారు. ఆదివారం హైదరాబాద్‌లో ఈ షో ఫస్ట్ ఎపిసోడ్ షూటింగ్ జరిగింది. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో చిత్రీకరణ పూర్తయ్యింది. ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇప్పటికే అన్‌స్టాపబుల్ సీజన్-2లో చంద్రబాబు, కుమారుడు లోకేష్‌తో కలిసి సందడి చేశారు. . అప్పుడు చంద్రబాబుప్రతిపక్ష నేతగా హోదాలో ఉన్నారు. చంద్రబాబు పలు కీలక అంశాలను బాలయ్యతో పంచుకున్నారు. గత సీజన్‌లో తెలుగుదేశం పార్టీ సంక్షోభం, నాటి అంశాలపై ఆయన బాలయ్యతో మాట్లాడారు. ఈ సీజన్-4లో ఏపీలో ఎన్డీయే కూటమి గ్రాండ్ విక్టరీ, ఎన్నికలకు ముందు, తదుపరి పరిణామాలను ఈ షోలో పంచుకున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు ఈ షోలో కీలక అంశాలను వెల్లడించినట్లు చెబుతున్నారు. అంతేకాదు టాక్ షోలో బాలయ్యతో కలిసి సీఎం చంద్రబాబు పలు టాస్క్‌లు ఆడినట్లు సమాచారం. ఈ ఎపిసోడ్‌పై టీడీపీ కేడర్, అభిమానుల్లో అంచనాలు పెంచుతోంది.

About rednews

Check Also

ఆ ఒక్క కారణంతో ఏపీ ప్రభుత్వ సలహాదారు పదవి తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నా: చాగంటి కోటేశ్వరరావు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నామినేటెడ్ పదవుల్ని భర్తీ చేసిన సంగతి తెలిసిందే. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుకు కూడా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *