ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలతోపాటుగా ప్రధాని మోదీని కలిశారు చంద్రబాబు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రధానమంత్రితో చర్చించారు. ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే పూర్తి ఖర్చును భరిస్తామని కేంద్రం గతంలో హామీ ఇచ్చింది. అలాగే ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లోనూ ఇదే విషయాన్ని పునరుద్ఘాటించింది. కేంద్రం హామీ ఇచ్చిన …
Read More »నాకున్న ఢిల్లీ సోర్స్‌తో చెబుతున్నా.. రేవంత్ చేయబోయేది ఇదే: కేటీఆర్
బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కావటం ఖాయమని సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం సంచలన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో చిట్ చాట్‌గా మాట్లాడిన ఆయన.. కేసీఆర్‌కు గవర్నర్ పదవి, కేటీఆర్‌కు సెంట్రల్ మినిస్టర్, కవితకు బెయిల్ ఇవ్వటంతో పాటు రాజ్యసభ సీటు కూడా ఇస్తారని.. హరీష్ రావుకు అసెంబ్లీలో అపొజిషన్ లీడర్ పదవి కట్టెబట్టనున్నట్లు ఆయన కామెంట్లు చేశారు. రేవంత్ చేసిన ఈ కామెంట్లపై తాజాగా.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. తమ పార్టీ బీజేపీలో విలీనం కావటం కాదని.. …
Read More »Siddaramaiah: సీఎం సిద్ధరామయ్యకు అరెస్ట్ తప్పదా.. కర్ణాటక కేబినెట్ అత్యవసర సమావేశం?
Siddaramaiah: కర్ణాటక రాజకీయాల్లో ముడా కుంభకోణం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. ముడా భూముల కేటాయింపు వ్యవహారం ప్రస్తుతం.. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చుట్టూ ఉచ్చులా బిగుసుకుంటుండటంతో ఆ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంలో సీఎంపై విచారణ చేపట్టేందుకు గవర్నర్ అనుమతి మంజూరు చేయడంతో.. సిద్ధరామయ్యను అరెస్ట్ చేస్తారనే ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే సీఎం సిద్ధరామయ్య.. కర్ణాటక కేబినెట్‌ను అత్యవసరంగా భేటీకి పిలవడం ప్రస్తుతం మరిన్ని అనుమానాలకు దారితీస్తోంది. ఈ నేపథ్యంలోనే ముడా కుంభకోణం వ్యవహారంలో సీఎంపై విచారణకు అనుమతించడంతో …
Read More »Ola Loans: ఎలాంటి పేపర్‌వర్క్ లేకుండానే ఇలా ఈజీగా రూ. 10 లక్షల లోన్.. ఓలా ఆఫర్.. ఎలాగంటే?
Ola Incred Loan: మీకు ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు అవసరం పడిందా.. మీ చేతిలో లేవా.. అప్పుడేం చేస్తారు. స్నేహితుల్నో, బంధువుల్నో అడుగుతుంటారు. అక్కడ కూడా లేకుంటే చాలా మంది ఎంచుకునే ఆప్షన్.. బ్యాంకులు. అవును బ్యాంకుల్లో పర్సనల్ లోన్ తీసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇక్కడ కొన్ని సార్లు పని ఈజీగా కాకపోవచ్చు. వడ్డీ రేట్లు నచ్చకపోవడం.. ఈఎంఐ ఎక్కువ కట్టాల్సి రావడం.. లేదా మీకు లోన్ వచ్చే అర్హత లేకపోవడం.. సిబిల్ స్కోరు తక్కువగా ఉండటం వంటి కారణాలతో తిరస్కరణకు గురి కావొచ్చు. …
Read More »Employees transfers: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. గైడ్‌లైన్స్ విడుదల.. వారికి మాత్రం!
AP Govt Employees transfer Guidelines: ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ఎన్ని రోజులుగానో ఉద్యోగులు ఎదురుచూస్తున్న బదిలీలకు ఆమోదం తెలిపింది. ఈ నెలాఖరు లోగా బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై గైడ్‌లైన్స్ విడుదల అయ్యాయి. మొత్తం 12 శాఖల్లో ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. బదిలీలకు వీలుగా ఆగస్టు 19 నుంచి ఆగస్ట్ 31వ తేదీ వరకు ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని నిలిపివేస్తూ ఆదేశాలు జారీచేశారు. మరోవైపు అన్ని ప్రభుత్వ …
Read More »కర్నూలు వ్యక్తికి సారీ చెప్పిన లోకేష్.. అసలేమైందంటే?
Nara Lokesh sorry to complainant:ఏపీ మంత్రి నారా లోకేష్ ఓ వ్యక్తికి క్షమాపణలు చెప్పారు. తన తరుఫున, తన విభాగం తరుఫున అతనికి క్షమాపణలు చెప్పారు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా ప్రకటించారు. అసలు సంగతిలోకి వస్తే టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా సమస్యల పరిష్కారానికి లోకేష్ పెద్ద పీట వేస్తున్నారు. ప్రజాదర్బార్ నిర్వహిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. సత్వర పరిష్కారం కోసం కృషిచేస్తున్నారు. అయితే మంగళగిరి నియోజకవర్గం ప్రజలకు ప్రజాదర్బార్ ద్వారా అందుబాటులో ఉంటున్న నారా లోకేష్.. …
Read More »Kolkata Trainee Doctor: బెంగాల్ ట్రైనీ డాక్టర్ హత్య కేసులో పోలీసుల ట్విస్ట్.. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో ఏముందంటే?
Kolkata Trainee Doctor: పశ్చిమ బెంగాల్‌లో ట్రైనీ డాక్టర్‌పై జరిగిన హత్యాచారం ఘటన మొత్తం దేశాన్ని కుదిపేస్తోంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ట్రైనీ డాక్టర్ పోస్టుమార్టంకు సంబంధించిన రిపోర్టులో సంచలన విషయాలు వెలుగుచూశాయని నెటిజన్లు కోడై కూస్తున్నారు. ఆ ట్రైనీ డాక్టర్‌పై గ్యాంగ్ రేప్ జరిగిందని.. ఆమె ఎముకలు విరిగిపోయాయని.. ఇక మరీ ముఖ్యంగా ఆమె శరీరంలో 150 మిల్లీ గ్రాముల వీర్యం ఉందని రకరకాల ఊహాగానాలు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయాలు వైరల్ కావడంతో …
Read More »వైసీపీ కార్యాలయం కూల్చివేతకు కారణమదే.. ఆళ్ల నాని
YSRCP Office Demolished in Eluru: ఏలూరులో వైసీపీ కార్యాలయం కూల్చివేత వ్యవహారంపై మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కీలక విషయాలు వెల్లడించారు. ఇటీవలే పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీ అధ్యక్ష పదవితో పాటుగా ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జి పదవికి కూడా ఆళ్ల నాని రాజీనామా చేశారు. తాజాగా వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు మాజీ మంత్రి వెల్లడించారు. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశం నిర్వహించిన ఆళ్ల నాని.. కీలక విషయాలు వెల్లడించారు. వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి …
Read More »పెళ్లి చేసుకుని తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన జంటకు ట్విస్ట్.. పోలీసుల అదుపులో,
ఓ జంట పెళ్లి చేసుకుని తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. ఇంతలో పోలీసులు సడన్ ఎంట్రీ ఇచ్చారు.. ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. ఏం జరిగిందని ఆరా తీస్తే.. అప్పుడు అసలు సంగతి తెలిసింది. విజయవాడకు చెందిన సాంబశివరావు అలియాస్ శివ, అలేఖ్య ప్రేమించుకుంటున్నారు.. రెండు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు. విజయవాడలోని భవానీపురం పోలీసు స్టేషన్‌లో అలేఖ్య కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. కొత్త జంట తిరుమల శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వస్తున్న విషయాన్ని గుర్తించిన భవానీపురం పోలీసులు తిరుచానూరు …
Read More »సిద్దిపేటలో హై టెన్షన్.. కాంగ్రెస్ కార్యకర్తల దాడి, బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళనలు
సిద్దిపేటలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఓవైపు కాంగ్రెస్ కార్యకర్తల దాడి, బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళనలతో.. వాతావరణం హాట్ హాట్‌గా మారింది. 2 లక్షల మేర రైతు రుణమాఫీని ఆగస్టు 15వ తేదీలోపు అమలు చేస్తే తన ఎమ్మెల్యే పదవి రాజీనామా చేస్తానని హరీష్ రావు చేసిన ఛాలెంజ్‌ను ఉటంకిస్తూ.. వైరా సభలో సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే.. దానికి హరీష్ రావు కూడా కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలోనే.. రుణమాఫీ చేశాం.. హరీశ్‌రావు రాజీనామా చేయాలంటూ సిద్దిపేటలో ఫ్లెక్సీలు …
Read More »Bengaluru: నన్ను జైల్లో పెట్టండి కానీ.. భార్యతో ఉండలేను.. వేధింపులతో ఇంటి నుంచి పారిపోయిన టెక్కీ!
భార్య వేధింపులకు తాళలేక ఇళ్లు వదిలి పారిపోయాడు ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. ఈ ఘటన దేశ ఐటీ రాజధాని బెంగళూరు నగరంలో చోటుచేసుకుంది. భర్త కనిపించకపోవడంతో భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదుచేసిన పోలీసులు.. అతడు నొయిడాలో ఉన్నట్టు గుర్తించారు. నచ్చజెప్పి అతడ్ని బెంగళూరుకు తీసుకురాగా.. భార్య నన్ను చిత్రహింసలకు గురిచేస్తోందని వాపోయాడు. అంతేకాదు, జైలుకి వెళ్లమన్నా వెళ్తా కానీ ఆమెతో జీవితం పంచుకోలేనని తెగేసి చెప్పాడు. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర బెంగళూరులో భార్యతో కలిసి నివాసం ఉంటోన్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ …
Read More »రూ.2 లక్షల వరకు రుణమాఫీ.. ఆ పైన లోన్ ఉన్న వారి పరిస్థితేంటి..?
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీల్లో ప్రధానమైంది రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ. తాము అధికారంలోకి వస్తే రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని.. వరంగల్ డిక్లరేషన్‌లో భాగంగా కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఆరు గ్యారంటీల్లోనూ ఇదే ప్రధానమైన హామీ. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రూ. 2 లక్షల రైతు రుణమాఫీ అమలు చేసింది. మెుత్తం మూడు విడతల్లో ఈ హామీ అమలైంది. మూడో విడతలో భాగంగా రూ. లక్షన్నర నుంచి రూ.2 లక్షల వరకు రైతులకు మాఫీ …
Read More »జగన్‌కు ప్రతిపక్ష నేత హోదా.. అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక వ్యాఖ్యలు
మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా అసెంబ్లీకి వచ్చి మాట్లాడవచ్చన్నారు స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు. తిరుపతి ఎస్వీ జంతు ప్రదర్శనశాల సందర్శించిన సభాపతి.. మొక్క నాటారు. శాసనసభలో ప్రతి సభ్యుడికి మాట్లాడే అవకాశం ఇస్తున్నామని.. జగన్ కూడా అసెంబ్లీకి వచ్చి మాట్లాడవచ్చన్నారు. జగన్ చేయి ఎత్తి అడిగితే మాట్లాడే అవకాశం ఇస్తామన్నారు.. ప్రతిపక్ష హోదా విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. ప్రతిపక్ష హోదా విషయంలో కచ్చితంగా నిబంధనలు పాటించాల్సిందేనన్నారు. జగన్ ప్రతిపక్ష హోదా అంశంపై చట్టపరిధిలో ఉన్నట్లుగానే నిర్ణయాలు ఉంటాయన్నారు. అసెంబ్లీకి రాని …
Read More »RBI: 3 బ్యాంకులకు సడెన్ షాకిచ్చిన ఆర్బీఐ.. కఠిన నిర్ణయం.. ఆ నిబంధనలు పాటించకపోవడంతో..!
Bank of Maharashtra: దేశంలోని అన్ని బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అనేది పెద్దన్న లాంటింది. ఇదే అన్ని నియంత్రణాధికారాలు కలిగి ఉంటుంది. ఆర్బీఐ ఆదేశాల్ని ఇవి తప్పక పాటించాల్సిందే. కస్టమర్ల పట్ల ఏ మాత్రం బ్యాంకులు నిర్లక్ష్యంగా వ్యవహరించినా.. తమకు తెలియకుండా ఏదైనా కొత్త నిబంధనలు తీసుకొచ్చినా ఆర్బీఐ ఊరుకోదు. కచ్చితంగా చర్యలు తీసుకుంటుంది. దీనిని ఫైన్ రూపంలో లేదా మరీ సమస్య తీవ్రంగా ఉంటే ఏకంగా బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసేందుకూ …
Read More »అనకాపల్లి జిల్లాలో అరుదైన పురుగు.. ధర ఏకంగా రూ.75 లక్షలు?, ఎందుకంత డిమాండ్!
ప్రపంచంలో అత్యంత అరుదైన కీటకం అనకాపల్లి జిల్లాలో ప్రత్యక్షమైంది. చీడికాడ మండలంలోని కోనాంలో ఔషధ గుణాలు కలిగిన స్టాగ్ బీటిల్ కనిపించింది. ఈ కీటకానికి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది.. ఈ కీటకం ధర రూ.75 లక్షల వరకు ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. కీటకానికి అంత ధర ఏంటి అని షాకవ్వకండి.. ప్రపంచంలోనే అత్యంత ఔషధ గుణాలు కలిగిన అరుదైన కీటకం స్టాగ్ బీటిల్ అని చెబుతుంటారు. ఈ కీటకం ఎవరికైనా దొరికితే అదృష్టవంతులే అని చెబుతుంటారు. బీఎండబ్ల్యూ, ఆడి కార్ల ధర కంటే …
Read More »