ఏపీలో పింఛన్లపై మరో తీపికబురు.. వాళ్లందరికి ఊరట, ప్రభుత్వం కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్లపై కీలక నిర్ణయం తీసుకుంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అనర్హుల పేరిట తొలగించిన పింఛన్లపై కేబినెట్ సమావేశంలో చర్చించారు. ఈ మేరకు పింఛన్ల సమస్యను గ్రామ సభల ద్వారా పరిష్కరించాలని నిర్ణయించింది. అర్హత ఉంటే చాలు ప్రతి ఒక్కరికి పింఛన్ అందిస్తామని ప్రభుత్వం చెబుతోంది.. అనర్హులపై మాత్రం వేటు తప్పదని చెబుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని రకాల పింఛన్లను తనిఖీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో తొలగించిన పింఛన్లపైనా నిర్ణయం తీసుకున్నారు.

గత ప్రభుత్వ హయాంలో అనర్హులకు పింఛన్లు ఇచ్చారనే ఫిర్యాదులు వచ్చాయి. కొంతమంది దివ్యాంగుల కేటగిరిలో ఎక్కువమంది తప్పుడు సదరం సర్టిఫికెట్లతో పింఛన్లు పొందినట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు ఈ పింఛన్ల తనిఖీతో పాటుగా కొత్త పింఛన్ల మంజూరుకు సంబంధించి విధివిధానాల రూపకల్పన కోసం 8మంది మంత్రులతో ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్, నారాయణ, డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, గుమ్మడి సంధ్యారాణి, సవిత, కొండపల్లి శ్రీనివాస్, సత్యకుమార్ యాదవ్‌లతో కేబినెట్ సబ్ కమిటీలో ఉన్నారు. ఈ మేరకు కమిటీ ఏర్పాటైన 10-15 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక అందించనున్నారు.

గత ప్రభుత్వ హయాంలో 2.32 లక్షల మందికి పింఛన్‌లు ఇవ్వలేదనే విమర్శలు ఉన్నాయి. గతేడాది 2023 సెప్టెంబర్‌ నాటికి 2.32 లక్షల పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో కొందరికి పింఛన్లు మంజూరు చేయగా.. మిగిలిన వారికి పింఛన్లు రాలేదు. ఈ పింఛన్ల అంశంపైనా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. అంతేకాదు రాష్ట్రవ్యాప్తంగా కొత్త పింఛన్లకు కూడా ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించనుంది. వచ్చే నెల నుంచి కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే పింఛన్‌లను కూడా తనిఖీ చేయనుంది.

About rednews

Check Also

ఆ ఒక్క కారణంతో ఏపీ ప్రభుత్వ సలహాదారు పదవి తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నా: చాగంటి కోటేశ్వరరావు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నామినేటెడ్ పదవుల్ని భర్తీ చేసిన సంగతి తెలిసిందే. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుకు కూడా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *