ఆంధ్రప్రదేశ్

ఆ ఒక్క కారణంతో ఏపీ ప్రభుత్వ సలహాదారు పదవి తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నా: చాగంటి కోటేశ్వరరావు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నామినేటెడ్ పదవుల్ని భర్తీ చేసిన సంగతి తెలిసిందే. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుకు కూడా కేబినెట్ ర్యాంక్‌తో కీలక పదవి దక్కింది. ఆయన్ను విద్యార్థులు నైతిక విలువల ప్రభుత్వ సలహాదారుగా నియమించారు.. రెండేళ్ల పాటు ఈ పదవిలొ కొనసాగుతారు. అయితే చాగంటి ఈ పదవిని తీసుకుంటారా లేదా అనే చర్చ జరిగింది. ఎందుకంటే 2017లో అప్పటి టీడీపీ ప్రభుత్వం, 2023లో అప్పటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మరోసారి పదవులు ఇచ్చినా ఆయన తిరస్కరించారు. తనకు ఈ పదవి దక్కడంపై చాగంటి …

Read More »

Dana Cyclone: ఏపీపై దానా తుఫాన్‌పై ప్రభావం.. ఈ జిల్లాల్లో వర్షాలు

వాయవ్య బంగాళాఖాతంలో దానా తీవ్ర తుఫాన్‌గా బలపడి హబాలిఖాతి నేచర్ క్యాంప్‌ (భిత్తర్కనిక)-ధమ్రాకు సమీపంలో తీరం దాటినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ తుఫాన్ గురువారం అర్ధరాత్రి తర్వాత 1:30 నుంచి తెల్లవారుజాము 3:30గంటల మధ్యతీరం దాటింది. ఇది పశ్చిమ-వాయువ్యదిశగా కదులుతూ శుక్రవారం మధ్యాహ్నం వరకు క్రమంగా బలహీనపడుతుందన్నారు.. ఈ క్రమంలో ఉత్తరాంధ్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లోని తీర ప్రాంతం వెంబడి ఈదురుగాలులు వీస్తాయన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో చెదురుమదురు వర్షాలు కురుస్తాయంటున్నారు.ఉత్తరాంధ్ర జిల్లాలపై తుఫాన్ …

Read More »

ఏపీలో పింఛన్‌లపై మరో శుభవార్త.. ఇకపై చాలా ఈజీగా, ఆరంచెల విధానం రద్దు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్లకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో పింఛన్ల లబ్ధిదారుల అర్హత నిర్ణయించేందుకు అనుసరించిన ఆరంచెల పరిశీలనకు గుడ్ బై చెప్పారు. ఈ విధానం ఇకపై ఉండబోదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టంచేశారు. ఇకపై రాష్ట్రంలో ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరించి అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛను అందుతుందని చెప్పారు. అలాగే గత ప్రభుత్వ హయాంలో అర్హత లేకపోయినా చాలామందిని లబ్ధిదారులుగా ఎంపిక చేశారంటూ ఫిర్యాదులు వచ్చాయి. వీటిని పరిశీలించేందుకు మంత్రులతో కమిటీ వేయాలని ముందు అనుకున్నారు.. …

Read More »

YS Sharmila: ఎవరి ఇంట్లో చెల్లిని, తల్లిని కోర్టుకు ఈడ్చారు..? జగన్‌కు షర్మిల కౌంటర్

YS Sharmila: వైఎస్ కుటుంబంలో జగన్, షర్మిల మధ్య ఆస్తి తగాదాలు.. బయటికి రావడం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. తాజాగా ఈ వివాదంపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించగా.. ఆ వ్యాఖ్యలకు ఆయన సోదరి, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కౌంటర్ ఇచ్చారు. అన్ని కుటుంబాల్లో ఉండే వివాదమే తమ ఇంట్లో ఉందంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయిన షర్మిల.. ప్రతీ ఇంట్లో తల్లి, చెల్లిని కోర్టుకు ఈడ్చుతున్నారా అంటూ ప్రశ్నించారు. ఇది సామాన్యమైన విషయం కాదు …

Read More »

Vizag: విశాఖ ఏజెన్సీవాసులకు గుడ్‌న్యూస్, ఆ సమస్యకు చెక్.. హోంమంత్రి అనిత కీలక ప్రకటన

Vizag: విశాఖ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలు ఆహ్లాదకరంగా, అందంగా ఉంటాయి. కానీ మారుమూల పల్లెలకు రవాణా సౌకర్యం ఉండదు. కనీసం రోడ్లు కూడా లేక చెట్లు, కొండలు, గుట్టలు దాటుకుంటూ అక్కడి ప్రజలు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. ఇక వర్షాలు, చలికాలం.. ఇలాంటి సమయాల్లో వారి బాధ వర్ణనాతీతం. అంతేకాకుండా ఏజెన్సీ ప్రాంతాల్లో ఎవరికైనా ఏదైనా ఆపద వస్తే.. వాళ్లు అక్కడి నుంచి బయట పడాలంటే ఒక యుద్ధం చేయాల్సిందే. ఇక అనారోగ్యం బారిన పడినవారు, పురిటి నొప్పులు వచ్చిన గర్భిణీలు, చావుబతుకుల్లో ఉన్న …

Read More »

ఏపీలో రైతులకు శుభవార్త.. 24 గంటల్లోనే అకౌంట్‌లలో డబ్బులు జమ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు తీపికబురు చెప్పింది. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే డబ్బుల్ని రైతుల అకౌంట్‌లకు జమ చేస్తోంది. ఈ అంశంపై మంత్రి నాదండ్ల మనోహర్ స్పందించారు. ‘రైతు నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో డబ్బులు ఖాతాలో జమ చేస్తామని చెప్పాము. తూ.గో.జిల్లా కొవ్వూరు మండలం ధర్మవరం గ్రామానికి చెందిన శ్రీ పోలిశెట్టి శేషయ్య అనే రైతు నుంచి కొనుగోలు చేసిన ధ్యానానికి 24 గంటల్లోనే డబ్బులు జమ చేశాము. రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే కాదు. ఇచ్చిన గడువు కంటే …

Read More »

ఏపీలో మద్యం షాపులు దక్కించుకున్నవారికి భారీ ఊరట.. ఈ నెలాఖరు వరకు పొడిగింపు

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మద్యం షాపుల్లో అమ్మకాలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 3,396 మద్యం షాపులకు సంబంధించి ఎక్సైజ్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఈ మద్యం షాపులకు సంబంధించి.. ఇటీవల జారీ చేసిన ప్రొవిజినల్‌ లైసెన్స్‌ల గడువును నెలాఖరు వరకు పొడిగిస్తూ ఎక్సైజ్‌ శాఖ డైరెక్టర్‌ నిషాంత్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. లైసెన్సీల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ నెల 31 వరకు ప్రొవిజినల్‌ లైసెన్స్‌లు కొనసాగుతాయి అని చెప్పారు. రాష్ట్రంలో మద్యం షాపులు దక్కించుకున్న వారు.. ఆ …

Read More »

ఏపీలో పింఛన్లపై మరో తీపికబురు.. వాళ్లందరికి ఊరట, ప్రభుత్వం కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్లపై కీలక నిర్ణయం తీసుకుంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అనర్హుల పేరిట తొలగించిన పింఛన్లపై కేబినెట్ సమావేశంలో చర్చించారు. ఈ మేరకు పింఛన్ల సమస్యను గ్రామ సభల ద్వారా పరిష్కరించాలని నిర్ణయించింది. అర్హత ఉంటే చాలు ప్రతి ఒక్కరికి పింఛన్ అందిస్తామని ప్రభుత్వం చెబుతోంది.. అనర్హులపై మాత్రం వేటు తప్పదని చెబుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని రకాల పింఛన్లను తనిఖీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో తొలగించిన పింఛన్లపైనా నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో అనర్హులకు …

Read More »

రేపు 12 గంటలకు ఏం జరగనుంది..? టీడీపీ ట్వీట్ దేనికి సంకేతం!

ఏపీ రాజకీయాల్లో ఇప్పుడో ట్వీట్ ఆసక్తికరంగా మారింది. రేపు (గురువారం) మధ్యాహ్నం 12 గంటలకు ఏం జరగనుందనేదీ అంతటా ఇంట్రెస్టింగ్‌గా మారింది. అధికారిక తెలుగుదేశం పార్టీకి చెందిన ఎక్స్ ఖాతా నుంచి ఈ ట్వీట్ రావడం విశేషం. ” బిగ్ ఎక్స్‌పోజ్.. కమింగ్ ఆన్ 24 అక్టోబర్ 12 PM.. స్టే ట్యూన్‌డ్” అంటూ టీడీపీ ట్వీట్ చేసింది. దీంతో రేపు మధ్యాహ్నం ఏం వెల్లడిస్తారా అనే విషయంమై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. అయితే ఎక్స్‌‍పోజ్ అన్నారంటే ఏదైనా కీలక అంశాన్ని …

Read More »

వైసీపీకి మరో బిగ్ షాక్.. వాసిరెడ్డి పద్మ గుడ్ బై, ఆయనకు జగన్ పదవి ఇవ్వడంతో ఆగ్రహం!

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల తర్వాత వైఎస్సార్‌సీపీకి నేతలు ఒక్కొక్కరుగా గుడ్ బై చెబుతున్నారు. ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు రాజీనామా చేశారు. తాజాగా తాజాగా మరో సీనియర్ మహిళా నేత, మాజీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ కూడా పార్టీని వీడేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. పద్మ ఇవాళ అధికారికంగా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. వైఎస్సార్‌సీపీని వీడటానికి కారణాలను ఆమె వెల్లడించే అవకాశంఉంది. ఏపీ ఎన్నికల ఫలితాల తర్వాత వాసిరెడ్డి పద్మ …

Read More »