రైల్వేస్టేషన్స్‌లో Free WiFi .. ఇలా సింపుల్‌గా యాక్సెస్‌ పొందొచ్చు

ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించే విషయంలో భారతీయ రైల్వే (ఇండియన్‌ రైల్వేస్‌) అప్‌డేటెడ్‌గా ఉంటుంది. అన్ని రకాల చర్యలను తీసుకుంటుంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ రైల్వే జోన్‌, తెలంగాణ రైల్వే జోన్‌తో సహా దేశంలోని మొత్తం 6,100 రైల్వే స్టేషన్లలో ఉచిత హైస్పీడ్ వై -ఫై సదుపాయాన్ని కల్పిస్తోంది. ప్రతి ప్రయాణికుడు రైల్వే స్టేషన్‌లో అరగంట పాటు ఉచిత హైస్పీడ్ ఇంటర్నెట్‌ను వినియోగించుకోవచ్చు. ఈశాన్య భారతదేశం నుండి కాశ్మీర్ లోయ వరకు ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు.

రైల్వే కంపెనీ రైల్‌టెల్, రైల్‌వైర్ పేరుతో రైల్వే స్టేషన్‌లలో వై-ఫై ఇంటర్నెట్‌ను అందిస్తోంది. అరగంట తర్వాత నామమాత్రపు ధరను చెల్లించి వినియోగించుకోవాల్సి ఉంటుంది. RailTel Wi-Fi సౌకర్యం కోసం నచ్చిన ప్లాన్‌ని ఎంచుకోవచ్చు. రైల్వే స్టేషన్‌కు వచ్చే ప్రయాణికులకు రైల్‌టెల్ వివిధ రకాల ప్లాన్‌లను అందిస్తుంది. ప్లాన్ల వివరాల కోసం రైల్‌టెల్‌ వెబ్‌సైట్‌ https://www.railtel.in/ చూడొచ్చు. RailTel అనేది ఒక రిటైల్ బ్రాడ్‌బ్యాండ్ ప్రొవైడర్.

ఈ Wi-Fi ఇంటర్నెట్ 1Mbps వేగాన్ని అందిస్తుంది. 30 నిమిషాల తర్వాత మీరు ఇంటర్నెట్‌ని ఉపయోగించడానికి కొంత డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. రైల్‌వైర్ ఇంటర్నెట్ ప్యాక్‌లు 10 రూపాయల నుండి ప్రారంభమవుతాయి. మీరు 34Mbps వేగంతో 5GB ఇంటర్నెట్ డేటాను ఉపయోగించుకోవచ్చు. దీాని వాలిడిటీ 24 గంటలు. https://www.railwire.co.in/ వెబ్‌సైట్‌ ద్వారా పూర్తి సమాచారన్ని పొందొచ్చు. ఈ ఉచిత వై-ఫై సర్వీసెస్‌ను కేవలం రైల్వే స్టేషన్‌లో మాత్రమే ఉపయోగించుకోవాలి. రైలు ప్రయాణంలో రైల్‌వైర్ ఇంటర్నెట్ పనిచేయదు. Wi-Fi ప్లాన్ చెల్లింపు కోసం మీరు నెట్‌బ్యాంకింగ్, వాలెట్, క్రెడిట్ కార్డ్ మరియు UPI ద్వారా రీఛార్జ్‌ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు రైల్వే స్టేషన్‌లో ఫ్రీ Wi-Fiని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం..

ఉచిత వైఫై కనెక్ట్‌ అయ్యే విధానం :

  • మొదట మీ స్మార్ట్‌ఫోన్లో రైట్ సైడ్ టాప్‌లో కనిపించే వైఫై ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
  • దీన్ని ఆన్ చేసి, రైల్‌వైర్ వైఫై నెట్‌వర్క్‌ని సెలెక్ట్ చేసుకోండి.
  • మొబైల్ బ్రౌజర్‌తో https://www.railwire.co.in/ వెబ్ పేజీని ఓపెన్ చేయండి.
  • ఆ తర్వాత మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి
  • మీ హై స్పీడ్ వైఫై పాస్‌వర్డ్ మీ ఫోన్‌కి OTP రూపంలో వస్తుంది.
  • దీని సాయంతో మీరు 30 నిమిషాల వరకు ఫ్రీ ఇంటర్నెట్ వాడొచ్చు.

About rednews

Check Also

Dana Cyclone: ఏపీపై దానా తుఫాన్‌పై ప్రభావం.. ఈ జిల్లాల్లో వర్షాలు

వాయవ్య బంగాళాఖాతంలో దానా తీవ్ర తుఫాన్‌గా బలపడి హబాలిఖాతి నేచర్ క్యాంప్‌ (భిత్తర్కనిక)-ధమ్రాకు సమీపంలో తీరం దాటినట్లు ఏపీ విపత్తుల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *