ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్లకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో పింఛన్ల లబ్ధిదారుల అర్హత నిర్ణయించేందుకు అనుసరించిన ఆరంచెల పరిశీలనకు గుడ్ బై చెప్పారు. ఈ విధానం ఇకపై ఉండబోదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టంచేశారు. ఇకపై రాష్ట్రంలో ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరించి అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛను అందుతుందని చెప్పారు. అలాగే గత ప్రభుత్వ హయాంలో అర్హత లేకపోయినా చాలామందిని లబ్ధిదారులుగా ఎంపిక చేశారంటూ ఫిర్యాదులు వచ్చాయి. వీటిని పరిశీలించేందుకు మంత్రులతో కమిటీ వేయాలని ముందు అనుకున్నారు.. …
Read More »Tag Archives: andhra pradesh
Vizag: విశాఖ ఏజెన్సీవాసులకు గుడ్‌న్యూస్, ఆ సమస్యకు చెక్.. హోంమంత్రి అనిత కీలక ప్రకటన
Vizag: విశాఖ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలు ఆహ్లాదకరంగా, అందంగా ఉంటాయి. కానీ మారుమూల పల్లెలకు రవాణా సౌకర్యం ఉండదు. కనీసం రోడ్లు కూడా లేక చెట్లు, కొండలు, గుట్టలు దాటుకుంటూ అక్కడి ప్రజలు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. ఇక వర్షాలు, చలికాలం.. ఇలాంటి సమయాల్లో వారి బాధ వర్ణనాతీతం. అంతేకాకుండా ఏజెన్సీ ప్రాంతాల్లో ఎవరికైనా ఏదైనా ఆపద వస్తే.. వాళ్లు అక్కడి నుంచి బయట పడాలంటే ఒక యుద్ధం చేయాల్సిందే. ఇక అనారోగ్యం బారిన పడినవారు, పురిటి నొప్పులు వచ్చిన గర్భిణీలు, చావుబతుకుల్లో ఉన్న …
Read More »ఏపీలో రైతులకు శుభవార్త.. 24 గంటల్లోనే అకౌంట్‌లలో డబ్బులు జమ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు తీపికబురు చెప్పింది. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే డబ్బుల్ని రైతుల అకౌంట్‌లకు జమ చేస్తోంది. ఈ అంశంపై మంత్రి నాదండ్ల మనోహర్ స్పందించారు. ‘రైతు నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో డబ్బులు ఖాతాలో జమ చేస్తామని చెప్పాము. తూ.గో.జిల్లా కొవ్వూరు మండలం ధర్మవరం గ్రామానికి చెందిన శ్రీ పోలిశెట్టి శేషయ్య అనే రైతు నుంచి కొనుగోలు చేసిన ధ్యానానికి 24 గంటల్లోనే డబ్బులు జమ చేశాము. రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే కాదు. ఇచ్చిన గడువు కంటే …
Read More »ఏపీలో మద్యం షాపులు దక్కించుకున్నవారికి భారీ ఊరట.. ఈ నెలాఖరు వరకు పొడిగింపు
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మద్యం షాపుల్లో అమ్మకాలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 3,396 మద్యం షాపులకు సంబంధించి ఎక్సైజ్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఈ మద్యం షాపులకు సంబంధించి.. ఇటీవల జారీ చేసిన ప్రొవిజినల్ లైసెన్స్‌ల గడువును నెలాఖరు వరకు పొడిగిస్తూ ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ నిషాంత్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. లైసెన్సీల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ నెల 31 వరకు ప్రొవిజినల్ లైసెన్స్‌లు కొనసాగుతాయి అని చెప్పారు. రాష్ట్రంలో మద్యం షాపులు దక్కించుకున్న వారు.. ఆ …
Read More »దూసుకొస్తున్న ‘దానా’.. ఏపీ సహా నాలుగు రాష్ట్రాలకు ముప్పు.. అలర్ట్ చేసిన ఐఎండీ
తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా అనంతరం బుధవారం ఉదయానికి తుఫానుగా మారింది. ఇప్పటికే ఈ తుఫానుకు ‘దానా’ అనే పేరును ఐఎండీ సూచించగా… గురువారం తెల్లవారుజామున (అక్టోబరు 24) ఇది తీవ్ర తుఫానుగా మారుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) పేర్కొంది. ప్రస్తుతం ఒడిశాలోని పారాదీప్‌కు ఆగ్నేయంగా 670 కిలోమీటర్లు, పశ్చిమ్ బెంగాల్‌లోని సాగర్ ఐల్యాండ్‌కు దక్షిణ-ఆగ్నేయంగా 720 కిలోమీటర్లు, బంగ్లాదేశ్‌లోని ఖేపుపురకు దక్షిణ-ఆగ్నేయంగా 700 కిలోమీటర్ల దూరంలో కేంద్రకృతమై ఉన్న ఈ తుఫాను గత ఆరు గంటలుగా గంటకు …
Read More »ఏపీ వాసుల మెట్రో కల నెరవరబోతోందా?.. ఇదిగో లేటెస్ట్ అప్‌డేట్
ఏపీ వాసుల మెట్రో కల నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. దానికి అనుగుణంగానే ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ మంత్రులు.. మెట్రో ప్రాజెక్ట్‌లపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. తాజాగా.. కేంద్రమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌తో సమావేశమయ్యారు ఏపీ మున్సిపల్ మంత్రి నారాయణ. విశాఖపట్నం, విజయవాడ మెట్రో ప్రాజెక్టుల గురించి ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ రెండు మెట్రో ప్రాజెక్టులపై ఇరువురు మధ్య కీలక చర్చ జరగ్గా.. ఏపీ మెట్రో ప్రాజెక్టులను త్వరగా ముందుకు తీసుకెళ్లాలని కేంద్రమంత్రి ఖట్టర్‌కు విజ్ఞప్తి చేశారు మంత్రి నారాయణ. …
Read More »తిరుమల శ్రీవారి భక్తులకు అద్భుత అవకాశం.. దర్శనం, గదులు బుక్ చేస్కోండి
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్యమైన గమనిక. తిరుమల శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవలు, వసతి గదులకు సంబంధించి 2025 జనవరి నెల కోటాను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేస్తోంది. టీటీడీ జనవరి నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను ఇవాళ ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తుంది. అలాగే శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన జనవరి నెల ఆన్ లైన్ కోటాను ఇవాళ ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేస్తోంది. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా …
Read More »ఏపీలో విద్యార్థులకు శుభవార్త.. అకౌంట్‌లలో డబ్బుల జమ, మంత్రి లోకేష్ కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ విద్యార్థులకు శుభవార్త చెప్పారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను చెల్లిస్తామని ప్రకటించారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూ.3,500 కోట్లు చెల్లించకుండా మోసం చేసిందన్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి మంత్రివర్గం, ఉన్నతాధికారులతో చర్చిస్తున్నట్లు తెలిపారు. ‘త్వరలోనే మీరు శుభవార్త వింటారని హామీ ఇస్తున్నా. నేను మీతోనే ఉన్నా’ అంటూ ట్వీట్ చేశారు. ఇవాళ కేబినెట్ భేటీలోనే నిధుల విడుదలకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది అంటున్నారు. ఫీజ్ రీయింబర్స్‌మెంట్ కోసం కొంతకాలంగా విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా డిగ్రీ, ఇంజినీరింగ్ …
Read More »TCS Campus in Vizag: విశాఖలో క్యాంపస్ ఏర్పాటు.. ప్లాన్ మార్చిన టీసీఎస్!.. అక్కడేనా?
ఏపీలోని యువతకు శుభవార్త.. విశాఖపట్నంలో టీసీఎస్ క్యాంపస్ ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. టాటా సన్స్ బోర్డు ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్‌తో భేటీ అనంతరం.. ఏపీలో టీసీఎస్ క్యాంపస్ ఏర్పాటు చేయనున్నట్లు ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అనంతరం 100 రోజుల్లోనే విశాఖపట్నంలో టీసీఎస్ క్యాంపస్‌కు శంకుస్థాపన చేస్తామని.. నారా లోకేష్ ఇటీవల మరోసారి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో వైజాగ్‌లో టీసీఎస్ క్యాంపస్ ఏర్పాటు కోసం ప్రయత్నాలు వేగంగా జరుగుతున్నాయి. అయితే వేగంగా టీసీఎస్ క్యాంపస్ ఏర్పాటు …
Read More »అనంతపురాన్ని ముంచెత్తిన పండమేరు.. విజయవాడ వరదల్లాగే, నీట మునిగిన కాలనీలు
విజయవాడను బుడమేరు వరద ముంచెత్తితే.. అనంతపురంపై పండమేరు విరుచుకుపడింది. సోమవారం నుంచి కురుస్తున్న వర్షాలకు నగరంలోని కాలనీలు నీటమునిగాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తాయి. సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షం దెబ్బకు.. అనంతపురంనకు ఆనుకుని ఉన్న పండమేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.. దీంతో వాగుకు ఇరువైపులా ఉన్న కాలనీలు పూర్తిగా నీట మునిగాయి. వాగుకు అంతకంతకు వరద ప్రవాహం పెరుగడంతో ప్రజలు ఇళ్లపైకి ఎక్కి సాయం కోసం ఎదురుచూశారు. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. వర …
Read More »