సిల్వర్ స్క్రీన్ మీద అసలు సిసలు హీరోలు ఎవరో అల్లు అరవింద్ చెప్పాడు. తన దృష్టిలో హీరో అంటే ఎవరు? అని అల్లు అరవింద్ చెప్పుకొచ్చాడు. ఓ సినిమా ఫ్లాప్ అయినా కూడా మినిమం కలెక్షన్లతో గట్టెక్కించేవాడే హీరో అని అన్నాడు. ఒక వేళ చిన్న, మీడియం హీరోల సినిమాలు ఫ్లాప్ అయితే రెండో షో నుంచే మొత్తం షెడ్డుకి వెళ్తుందన్నట్టుగా చెప్పుకొచ్చాడు. కానీ ఓ హీరో సినిమా ఫ్లాప్ అయినా కూడా కలెక్షన్లు వచ్చాయంటే.. అతడే రియల్ హీరో అన్నట్టుగా అల్లు అరవింద్ ఓ ఈవెంట్‌లో మాట్లాడాడు.
ప్రస్తుతం అల్లు అరవింద్ మాట్లాడిన మాటల్ని రామ్ చరణ్ ఫ్యాన్స్ తెగ ట్రెండ్ చేస్తున్నారు. రామ్ చరణ్ డిజాస్టర్, ఫ్లాప్ సినిమాలు సైతం మంచి కలెక్షన్లను రాబట్టాయంటూ లెక్కలు చెబుతున్నారు. రచ్చ, నాయక్ వంటి సినిమాలే 40 కోట్ల షేర్ వరకు రాబట్టాయని నాటి రోజుల్ని గుర్తు చేస్తున్నారు. కానీ బన్నీ ఫ్లాప్ చిత్రాలకు ఆ రేంజ్ కలెక్షన్లు మాత్రం రాలేదని ట్రోలింగ్ చేస్తున్నారు.